నారాయణఖేడ్ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఇప్పటి వరకు 80 శాతం మంది చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలు వేయడం పూర్తి అయినట్లు డీఎం అండ్ హెచ్‌ఓ పద్మ తెలిపారు. ఆదివారం నారాయణఖేడ్‌కు వచ్చిన సందర్భంగా ఆమె స్థానిక సీహెచ్‌ఎన్‌సీని సందర్శిం చారు. ఈ సందర్భంగా ఆమె పల్స్‌పోలియో మందును పంపిణీని పరిశీలించారు.
అనంతరం మాట్లాడారు. జిల్లాలో 3.50 లక్షల మంది చిన్నారులకు, 2,342 బూత్‌ల ద్వారా, 9,368 సిబ్బందితో పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. నారాయణఖేడ్ క్లస్టర్‌లో 70 శాతం పూర్తయ్యిందన్నారు. 20, 21వ తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి మిగిన శాతాన్ని పూర్తి చేస్తారని ఆమె వివరించారు.
ప్రభుత్వాస్పత్రుల్లో 57 శాతం ప్రసవాలు
జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో ప్రస్తుతం 57 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని పద్మ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గర్భిణుల నమోదులో మెదక్ జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈనెల 450 ప్రసవాలు జరిగాయని తెలిపారు.
పీహెచ్‌సీలో ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మార్పులో భాగంగా జనవరి 24న సిద్దిపేటలో గర్భిణుల కోసం ‘హైరిస్క్ కేర్ సెంటర్’ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పీహెచ్‌సీల్లో వైద్యం కోసం 120 మంది వైద్యులు అవసరం ఉండగా ప్రస్తుతం 68 మంది వైద్యులు మాత్రమే ఉన్నారన్నారు. అయినా మెరుగైన సేవలు అందిస్తున్టన్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈఓ భరత్ సత్యనారాయణ, వేణుగోపాల్, జట్ల భాస్కర్, మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.
పోలియో చుక్కలు 80 శాతం పూర్తి
Published Mon, Jan 20 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
Advertisement
Advertisement