ఈరోజు దుర్గమ్మ ధవళవస్త్రధారిణిౖయె సంగీత రస స్వరూపమైన మరాళ వాహనంపై తారాహారాలు కంఠాభరణాలుగా ధరించి జ్ఞానాధిష్ఠాన దేవత, వాగ్దేవిౖయెన శ్రీ మహాసరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తుంది. దుర్గాదేవి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువుదీరిన దుర్గాదేవిని చదువులతల్లి అయిన సరస్వతీదేవి రూపంలో అలంకరించటం విశేషం. శ్రీ సరస్వతీదేవి రూపంలో దుర్గమ్మను దర్శించుకుంటే విశేష జ్ఞాన సంపద కలుగుతుందని ప్రతీతి.
శ్లోకం : యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా
నమస్తస్మై నమస్తస్మై నమస్త్మై నమో నమః
భావం : సృష్టిలోని సమస్త జీవులయందు బుద్ధి రూపంలో ప్రకాశిస్తున్న ఓ జగన్మాతా నీకు మొక్కెదన్.
నివేదన : జీడిపప్పు, కొబ్బరి పులిహోర
ఫలమ్: బుద్ధి కుశలత, జ్ఞానసంపద, విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు.