అమితాబ్ ట్విట్టర్లో అతిపెద్ద దుర్గమ్మ! | Amitabh Bachchan shares photo of 'world's largest Durga idol' | Sakshi
Sakshi News home page

అమితాబ్ ట్విట్టర్లో అతిపెద్ద దుర్గమ్మ!

Published Mon, Oct 19 2015 4:19 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అమితాబ్ ట్విట్టర్లో అతిపెద్ద దుర్గమ్మ! - Sakshi

అమితాబ్ ట్విట్టర్లో అతిపెద్ద దుర్గమ్మ!

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సోమవారం తన అభిమానులకు దుర్గాదేవీ పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత దయవల్ల అందరికీ సుఖశాంతులు, సంపద కలుగాలని, రానున్న రోజులు మరిన్ని శుభాలు చేకూరాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద దుర్గాదేవి విగ్రహం ఫొటోను అమితాబ్ ట్వీట్ చేశారు. కోల్కతాలోని దేశప్రియా పార్కులో 88 అడుగుల దుర్గామాత విగ్రహాన్ని నెలకొల్పారు.


40మంది శిల్పులు రెండు నెలలు కష్టపడి సిమెంట్తో, సంప్రదాయ అమ్మవారి రూపంలో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. కోల్కతాలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ అమ్మవారి ఫొటోను అమితాబ్ ట్విట్టర్లో షేర్ చేశారు. అమితాబ్ సతీమణి జయబచ్చన్ బెంగాళీ కావడంతో ఆయన కుటుంబం కూడా దుర్గాదేవీ పూజలను ఘనంగా నిర్వహిస్తున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement