దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. దేవి విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేస్తున్న క్రమంలో వచ్చిన భారీ అలతో యువకుడు కొట్టుకుపోయాడు. గల్లంతైన యువకుడి కోసం స్థానికులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా పూసపాటిరాగ మండలం చింతపల్లి సముద్రతీరంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా రణస్థలి మండలానికి చెందిన వెంకటేష్(29) దుర్గాదేవి నిమజ్జనంలో పాల్గొనడానికి చింతపల్లి బీచ్‌కు వచ్చాడు. విగ్రహాన్ని నీటిలో వదులుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు.
దుర్గాదేవి నిమజ్జనంలో అపశ్రుతి
Published Sat, Oct 24 2015 2:05 PM | Last Updated on Sat, Sep 29 2018 5:55 PM
Advertisement
Advertisement