సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఖరిపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మరోసారి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్లకు ఉన్నతాధికారుల నియామకంపై ఆయన సునిశిత విమర్శ చేశారు. గతంలో ఆరునెలల పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టరే (ఎండీ) లేని పరిస్థితిలో పని చేసిందని.. తర్వాత ఆ పదవిలో నియమించిన ఐఏఎస్ అధికారి పద్మను కూడా ఆరు నెలలు పూర్తి కాకముందే అక్కడ నుంచి బదిలీ చేసి, ఆమెకే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడాన్ని ఐవైఆర్ ట్విటర్ ద్వారా తప్పుపట్టారు.
దాదాపు రూ.1,000 కోట్ల లావాదేవీలు జరిగే కాపు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కనీసం ఐఏఎస్ అధికారిని కూడా నియమించకుండా జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని ఆ బాధ్యతల్లో నియమించారని దుయ్యబట్టారు. గత సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఓట్లు వేసి గెలిపించిన రెండు కులాలపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.
Brahmin Corp without MD for six months then padma was posted . With in six month transferred and kept additional charge.kapu Corp 1000 cr budget managed by j d level officer . So much for the commitment of govt to these two communities who whole heatedly voted them to power.
— IYR KrishnaRao Former CS GoAP (@IYRKRao) 23 January 2018
Comments
Please login to add a commentAdd a comment