Brahmana corporation
-
బ్రాహ్మణుల కల సాకారం : మంత్రి వెల్లంపల్లి
-
‘బ్రాహ్మణుల దశాబ్దాల కల సాకారం’
సాక్షి, విజయవాడ : వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలిపి సీఎం జగన్మోహన్రెడ్డి బ్రాహ్మణుల దశాబ్దాల కలను సాకారం చేశారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు. మంగళవారం డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణులతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ఓటుబ్యాంకు రాజకీయాలు చేసే చంద్రబాబుకు సంక్షేమ సారధి వైఎస్ జగన్‌కు మధ్య తేడాను ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. 439 జీవో అమలు చేయడం ద్వారా బ్రాహ్మణులు సంతోషిస్తున్నారని, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత అర్చకుల సంక్షేమం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు జగనేనని ప్రశంసించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అర్చకుల కుటుంబాల్లో భయాందోళనలు తొలిగి దేవుని సేవలో నిస్వార్థంగా, సంతోషంగా పనిచేసేందుకు దోహదపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 33 యాక్ట్‌ను అర్చకుల వంశపారంపర్యం కోసం ప్రతిపాదించారని గుర్తు చేశారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఆచరణలో చూపి రూ. 234 కోట్లను ధూపదీప నైవేద్యానికి బడ్జెట్లో నిధులు కేటాయించడం, 100 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 439 జీవో ద్వారా బ్రాహ్మణులకు న్యాయం జరిగి, చరిత్రలో ఇదో మైలు రాయిగా నిలుస్తుందని వెల్లడించారు. సమస్యల పరిష్కారంతో హిందూ ధర్మాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని వ్యాఖ్యానించారు. -
శుభం ప్రాప్తిరస్తు..
సాక్షి, రైల్వేకోడూరు అర్బన్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన బ్రాహ్మణులకు స్వర్ణయుగం లాగా ఉండేది. ఆయన హయాంలో పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందరికీ అందాయి. బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. జిల్లాలో మొత్తం బ్రాహ్మణ కుటుంబాలు 18 వేలకు పైగా ఉన్నాయి. 2004కు ముందు చంద్రబాబు పాలనలో బ్రాహ్మణులను పట్టించుకున్న దాఖలాలు లేవు. వారి కోసం వైఎస్సార్ 24 పథకాలు అమలు చేశారు. ఆయన అర్చకుల జీవన పరిస్థితులపై అధ్యయనం చేసి వారి కుటుంబాల సంక్షేమం కోసం ఆ పథకాలు ప్రవేశ పెట్టారు. తండ్రి అడుగు జాడలలో నడుస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాజకీయ ఉనికి కోల్పోతున్న బ్రాహ్మణులకు ఈ సార్వత్రిక ఎన్నికలలో నాలుగు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించడంపై బ్రాహ్మణ సామాజిక వర్గం కృతజ్ఞతలు తెలుపుతోంది. వైఎస్సార్ ప్రభుత్వం బ్రాహ్మణులను అన్ని విధాలా ఆదుకున్నదని.. అలాగే జగన్ కూడా మరో అడుగు ముందుకేసి సముచిత స్థానం కల్పించడంపై రాష్ట్రంలోని బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ బ్రాహ్మణ కార్పొరేషన్లో బ్రాహ్మణ నిధి ద్వారా 500 కోట్లకు పైగా ఇస్తానని ఇచ్చిన హామీపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 60 ఏళ్లు నిండిన పేద బ్రాహ్మణులకు ఆయుష్మాన్ భవ పథకం ద్వారా నెలకు 5 వేల గౌరవ వేతనం ప్రకటించడంపై అభినందనలు తెలుపుతున్నారు. వైఎస్సార్ అమలు చేసిన పథకాలు ఉపనయన గ్రాంటు కింద రూ.25 వేలు రూ.5 వేలలోపు ఆదాయం కలిగిన అర్చకుల పిల్లలకు విద్యా రుణం కింద రూ.35 వేల గ్రాంటు, 60 నెలల్లో తిరిగి చెల్లించే సౌకర్యం. 2 వేలలోపు ర్యాంకు వచ్చిన వైద్య విద్యార్థులకు, 5 వేల లోపు ర్యాంకు వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థుల చదువు, భోజనం, వసతి ఖర్చులన్నీ ప్రభుత్వం భరించింది. రూ. 5 వేల నుంచి 12,500లోపు జీతం తీసుకుంటున్న వారికి రూ.33 వేలు వడ్డీలేని రుణం అందించింది. అర్చకుని కుమారుడు, లేదా కుమార్తె వివాహం కోసం లక్ష రూపాయల రుణం ఇంటి మరమ్మతుల కోసం 4 శాతం వడ్డీకి లక్ష రూపాయల రుణం 65 ఏళ్ల వయసు దాటిన వారికి వృద్ధాప్య భృతిగా నెలకు రూ.1500 4 శాతం వడ్డీతో మోటారు సైకిల్‌కు రుణం సొంత ఇల్లు లేని అర్చకునికి ఇంటి అద్దె, సామాజిక జీవితం బీమా పథకం కింద లక్ష రూపాయల వరకు పాలసీ వైఎస్ జగన్ హామీలు రాజకీయ ఉనికి కోల్పోతున్న బ్రాహ్మణులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సార్వత్రిక ఎన్నికలలో నాలుగు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు. బ్రాహ్మణ కార్పొరేషన్లో బ్రాహ్మణ నిధి ద్వారా 500 కోట్లకు పైగా ఇస్తామని ప్రకటించారు. 60 ఏళ్లు నిండిన పేద బ్రాహ్మణులకు ఆయుష్మాన్ భవ పథకం ద్వారా నెలకు 5 వేల గౌరవ వేతనం నవరత్నాల ద్వారా పలు పథకాల వర్తింపు వెయ్యి కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ పేద బ్రాహ్మణులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.500 కోట్ల నిధులు సమకూర్చుతామని జగన్ ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జగన్ సీఎం అయితే పేద బ్రాహ్మణుల జీవితాలలో వెలుగులు వస్తాయి. –ఆర్సీ సురేష్‌బాబు, ప్రముఖ న్యాయవాది, వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ కార్యదర్శి చంద్రబాబు మోసం చేశారు టీడీపీ ప్రభుత్వం స్థాపించిన నాటి నుంచి అనాదిగా బ్రాహ్మణులను ఆ పార్టీ మోసం చేస్తూనే ఉంది. ప్రతి ఎన్నికలలో వాగ్దానం చేసి అమలు చేయడం లేదు. చట్టసభలలో ప్రాధాన్యం ఇవ్వరు. మొదటగా కరణీకాన్ని తొలగించి బ్రాహ్మణులకు గ్రామాల ప్రాధాన్యం లేకుండా చేసింది. అర్చక కులవృత్తిని కూడా తొలగించాలని కుట్ర చేస్తూ వయోపరిమితి తెచ్చింది. తరువాత వైఎస్సార్ మాత్రమే బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇచ్చారు. రాజకీయంగా చట్టసభలలో ప్రాధాన్యం ఇచ్చి వేల గుడులకు దూపదీప నైవేద్యాలు మంజూరు చేశారు. అదే కోవలో జగన్ బ్రాహ్మణులకు 4 అసెంబ్లీ సీట్లిచ్చి బ్రాహ్మణ జాతిని ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటున్నారు. మేమంతా జగన్ వెంటే. –ఎంఎల్ఎన్ సురేష్‌బాబు, వైఎస్సార్ బ్రాహ్మణ అధ్యయన కమిటీ రాష్ట్ర సభ్యుడు, కడప విద్యార్థులకు మేలు విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజురీయింబర్స్‌మెంట్ సౌకర్యాలకు ప్రస్తుతం ఉన్న వార్షికాదాయం పరిమితి రూ.లక్ష నుంచి 3 లక్షలకు పెంచుతానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో బ్రాహ్మణ విద్యార్థులు ఉన్నత చదువు అభ్యసించేందుకు ఉత్సాహంగా ఉన్నారు. –శ్రీధర వెంకటేష్, పురోహితుడు, కడప టీడీపీ హామీలు విస్మరించింది 2014 ఎన్నికలలో టీడీపీ మేనిఫెస్టోలో బ్రాహ్మణ డిక్లరేషన్ అంశాలలో శివార్చకులను బీసీ డీగా చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చారు. అయినా ఇప్పటికీ పట్టించుకోలేదు.–గుండ్లమూడి సత్యనారాయణశర్మ, రాష్ట్ర బ్రాహ్మణ సంఘం సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి, కడప ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు అర్హులైన పేద బ్రాహ్మణులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని జగన్ ఇచ్చిన హామీ హర్షణీయం. జగన్ పేదల కష్టాలు తెలిసిన, దక్షత కలిగిన నాయకుడు. ఆయనను ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. – శివస్వామి, పుల్లంపేట రాజన్నపాలనలో అభివృద్ధి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే బ్రాహ్మణుల అభివృద్ధికి మొదటి అడుగు పడింది. ఆలయాలలో దూప దీప నైవేద్యానికి కంకణం కట్టారు. నేడు చాలా ఆలయాలలో నిత్యం పూజలు జరుగుతున్నాయంటే ఆయన ఘనతే. జగన్ కూడా ఆయన అడుగుజాడలలో బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేయడం ఆనందించదగ్గ విషయం.–ఎస్.రవికుమార్‌శర్మ, నందలూరు మండలం -
బ్రాహ్మణులపై కక్షకట్టిన బాబు
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని బ్రాహ్మణులపై కక్ష కట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ కన్వీనర్లు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, విజయవాడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. సోమవారం నగరంలోని సూరజ్ గ్రాండ్ హోటల్లో ‘వైఎస్సార్సీపీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ’ సమావేశం జరిగింది. కమిటీ సభ్యుడు సుదర్శన శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కన్వీనర్లు కోన రఘుపతి, మల్లాది విష్ణు మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణుల స్థితిగతులు తెలుసుకుని వారి అభివృద్ధికి తీసుకునే చర్యలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో ఉంచుతారన్నారు. ఇది బ్రాహ్మణులకు శుభపరిణామమన్నారు. మహానేత వైఎస్ హయాంలో కులాలు, మతాలకు అతీతంగా అంతా అభివృద్ధి చెందారన్నారు. అయితే చంద్రబాబు మాత్రం బ్రాహ్మణుల విషయంలో కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేవసిన ఐవీఆర్ కృష్ణారావు విషయంలో ఎలా వ్యవహరించారో రాష్ట్రమందరికీ తెలుసన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తెలంగాణ వ్యక్తికి కట్టబెట్టారన్నారు. ఆయన చంద్రబాబు కాళ్లు పట్టుకుంటారని విమర్శించారు. సమాజంలో బ్రాహ్మణులకు ప్రత్యేక గౌరవం ఉందన్నారు. కేవలం ఓటు బ్యాంకు కోసమే చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అత్తెసరు నిధులు కేటాయించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే రూ. వెయ్యి కోట్లతో ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ప్రతి బ్రాహ్మణుడు మెచ్చేలా కమిటీ నివేదిక ఉంటుందన్నారు. టీటీడీ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితుల విషయంలో సీఎం వ్యవహరించిన తీరు బ్రాహ్మణులు మరిచిపోరన్నారు. రాష్ట్రంలో ధార్మిక, దేవాలయ వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. పుష్కరాల సమయంలో పెద్ద సంఖ్యలో ఆలయాలను కూల్చివేశారని గుర్తు చేశారు. విజయవాడ అమ్మవారి గుడిలో క్షుద్రపూజలేంటని ప్రశ్నించారు. వీటిన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ‘నిన్ను నమ్మం బాబు’ అంటున్నారన్నారు. అర్చకులంటే అంత చులకనా? ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ బ్రాహ్మణులకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలన్నారు. అర్చకుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చాలా చులకనగా ఉందన్నారు. వివిధ సర్వేల్లో వైఎస్సార్సీపీ ముందుంజలో ఉండడంతో చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. త్వరలోనే బ్రాహ్మణులకు మంచిరోజులు వస్తాయన్నారు. కమిటీ సభ్యుడు డాక్టర్ హెమ్మనూరు సుదర్శనశర్మ మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో బ్రాహ్మణులు 8 లక్షల ఓటర్లు ఉన్నారన్నారు. ఈ ప్రాంతం నుంచి ఒక అసెంబ్లీ టికెట్ కేటాయించే విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణ సంఘాల నాయకులు రఘురామయ్య, జ్వాలాపురం శ్రీకాంత్, ప్రసాద్, తారానాథ్ శర్మ, మధుసూదన్, జ్వాలా నరసింహ, బీఎస్ఎన్ కుమార్, సురేష్, నిరంజన్‌శర్మ, శ్రీనివాసమూర్తి, నాగేష్, పురుషోత్తం పాల్గొన్నారు. -
చంద్రబాబు సర్కార్ తీరుపై ఐవైఆర్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఖరిపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మరోసారి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్లకు ఉన్నతాధికారుల నియామకంపై ఆయన సునిశిత విమర్శ చేశారు. గతంలో ఆరునెలల పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టరే (ఎండీ) లేని పరిస్థితిలో పని చేసిందని.. తర్వాత ఆ పదవిలో నియమించిన ఐఏఎస్ అధికారి పద్మను కూడా ఆరు నెలలు పూర్తి కాకముందే అక్కడ నుంచి బదిలీ చేసి, ఆమెకే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడాన్ని ఐవైఆర్ ట్విటర్ ద్వారా తప్పుపట్టారు. దాదాపు రూ.1,000 కోట్ల లావాదేవీలు జరిగే కాపు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కనీసం ఐఏఎస్ అధికారిని కూడా నియమించకుండా జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని ఆ బాధ్యతల్లో నియమించారని దుయ్యబట్టారు. గత సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఓట్లు వేసి గెలిపించిన రెండు కులాలపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. Brahmin Corp without MD for six months then padma was posted . With in six month transferred and kept additional charge.kapu Corp 1000 cr budget managed by j d level officer . So much for the commitment of govt to these two communities who whole heatedly voted them to power. — IYR KrishnaRao Former CS GoAP (@IYRKRao) 23 January 2018 -
'అర్చకుల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది'
నంద్యాల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై వైఎస్సార్సీపీ నేత చెరుకుచర్ల రఘురామయ్య మండిపడ్డారు. బుధవారం నంద్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన, దేవుడికి నిత్యం దీప, దూప నైవేద్యాలు అందించే అర్చకుల వేతనాలను ముఖ్య మంత్రి తగ్గించాలని అనుకోవడం దౌర్భాగ్యం అన్నారు. అర్చకులు ఉసురు చంద్రబాబుకు కచ్చితంగా తగులుతుందన్నారు. దేవాదాయ శాఖ ఆదాయాన్ని స్వప్రయోజనాలకు వాడుకొనే ప్రభుత్వం అర్చకులను మాత్రం రోడ్డున పడేయాలని చూస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం బ్రాహ్మణులను తీవ్రంగా అవమానిస్తోందన్నారు. బ్రాహ్మణుల తరపున పోరాడే ఐవైఆర్ కృష్ణారావును అవమానకరంగా పదవి నుంచి తొలగించారని మండిపడ్డారు. బ్రాహ్మణ కార్పోరేషన్‌కు రూ.500కోట్లు ఇస్తామన్న చంద్రబాబు ఇప్పటి వరకూ కనీసం రూ.100 కోట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ కార్పోరేషన్‌ను పటిష్ట పరిచి వారి సంక్షేమానికి కృషి చేస్తామని రఘురామయ్య తెలిపారు. -
ధర్మాన్ని రక్షిద్దాం..
తాడేపల్లి (తాడేపల్లి రూరల్): ప్రతిఒక్కరూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐ.వి.ఆర్. కృష్ణారావు చెప్పారు. సీతానగరంలోని ‘సీత’ కార్యాలయంలో ఆదివారం సమరసత ఫౌండేషన్ ప్రాంతీయ సమావేశంలో ఆయన ముఖ్య అతి«థిగా పాల్గొన్నారు. హిందూ ధర్మంలో అందరూ సమానమేనని అన్నారు. హిందూ ధర్మ ప్రచారానికి ఫౌండేషన్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. కంచి స్వామి విజయేంద్ర సరస్వతి మాట్లాడుతూ విశ్వశాంతి కోసం అందరూ ధర్మాన్ని పాటించాలని ఉద్బోధించారు. ఫౌండేషన్ కార్యదర్శి త్రినాథ్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో ‘సీత’ డైరెక్టర్ వి.జయరాఘవాచార్యులు, అక్షర భారతి ఉపాధ్యక్షుడు డి.రామకృష్ణ పాల్గొన్నారు.