సాక్షి, రైల్వేకోడూరు అర్బన్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన బ్రాహ్మణులకు స్వర్ణయుగం లాగా ఉండేది. ఆయన హయాంలో పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందరికీ అందాయి. బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. జిల్లాలో మొత్తం బ్రాహ్మణ కుటుంబాలు 18 వేలకు పైగా ఉన్నాయి. 2004కు ముందు చంద్రబాబు పాలనలో బ్రాహ్మణులను పట్టించుకున్న దాఖలాలు లేవు. వారి కోసం వైఎస్సార్ 24 పథకాలు అమలు చేశారు. ఆయన అర్చకుల జీవన పరిస్థితులపై అధ్యయనం చేసి వారి కుటుంబాల సంక్షేమం కోసం ఆ పథకాలు ప్రవేశ పెట్టారు. తండ్రి అడుగు జాడలలో నడుస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి..
రాజకీయ ఉనికి కోల్పోతున్న బ్రాహ్మణులకు ఈ సార్వత్రిక ఎన్నికలలో నాలుగు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించడంపై బ్రాహ్మణ సామాజిక వర్గం కృతజ్ఞతలు తెలుపుతోంది. వైఎస్సార్ ప్రభుత్వం బ్రాహ్మణులను అన్ని విధాలా ఆదుకున్నదని.. అలాగే జగన్ కూడా మరో అడుగు ముందుకేసి సముచిత స్థానం కల్పించడంపై రాష్ట్రంలోని బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌లో బ్రాహ్మణ నిధి ద్వారా 500 కోట్లకు పైగా ఇస్తానని ఇచ్చిన హామీపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 60 ఏళ్లు నిండిన పేద బ్రాహ్మణులకు ఆయుష్మాన్ భవ పథకం ద్వారా నెలకు 5 వేల గౌరవ వేతనం ప్రకటించడంపై అభినందనలు తెలుపుతున్నారు.
వైఎస్సార్ అమలు చేసిన పథకాలు
- ఉపనయన గ్రాంటు కింద రూ.25 వేలు
- రూ.5 వేలలోపు ఆదాయం కలిగిన అర్చకుల పిల్లలకు విద్యా రుణం కింద రూ.35 వేల గ్రాంటు, 60 నెలల్లో తిరిగి చెల్లించే సౌకర్యం.
- 2 వేలలోపు ర్యాంకు వచ్చిన వైద్య విద్యార్థులకు, 5 వేల లోపు ర్యాంకు వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థుల చదువు, భోజనం, వసతి ఖర్చులన్నీ ప్రభుత్వం భరించింది.
- రూ. 5 వేల నుంచి 12,500లోపు జీతం తీసుకుంటున్న వారికి రూ.33 వేలు వడ్డీలేని రుణం అందించింది.
- అర్చకుని కుమారుడు, లేదా కుమార్తె వివాహం కోసం లక్ష రూపాయల రుణం
- ఇంటి మరమ్మతుల కోసం 4 శాతం వడ్డీకి
- లక్ష రూపాయల రుణం
- 65 ఏళ్ల వయసు దాటిన వారికి వృద్ధాప్య భృతిగా నెలకు రూ.1500
- 4 శాతం వడ్డీతో మోటారు సైకిల్‌కు రుణం
- సొంత ఇల్లు లేని అర్చకునికి ఇంటి అద్దె, సామాజిక జీవితం బీమా పథకం కింద లక్ష రూపాయల వరకు పాలసీ
వైఎస్ జగన్ హామీలు
- రాజకీయ ఉనికి కోల్పోతున్న బ్రాహ్మణులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సార్వత్రిక ఎన్నికలలో నాలుగు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు.
- బ్రాహ్మణ కార్పొరేషన్‌లో బ్రాహ్మణ నిధి ద్వారా 500 కోట్లకు పైగా ఇస్తామని ప్రకటించారు.
- 60 ఏళ్లు నిండిన పేద బ్రాహ్మణులకు ఆయుష్మాన్ భవ పథకం ద్వారా నెలకు 5 వేల గౌరవ వేతనం
- నవరత్నాల ద్వారా పలు పథకాల వర్తింపు
వెయ్యి కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్
పేద బ్రాహ్మణులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.500 కోట్ల నిధులు సమకూర్చుతామని జగన్ ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జగన్ సీఎం అయితే పేద బ్రాహ్మణుల జీవితాలలో వెలుగులు వస్తాయి.
–ఆర్‌సీ సురేష్‌బాబు, ప్రముఖ న్యాయవాది, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర లీగల్ కార్యదర్శి
చంద్రబాబు మోసం చేశారు
టీడీపీ ప్రభుత్వం స్థాపించిన నాటి నుంచి అనాదిగా బ్రాహ్మణులను ఆ పార్టీ మోసం చేస్తూనే ఉంది. ప్రతి ఎన్నికలలో వాగ్దానం చేసి అమలు చేయడం లేదు. చట్టసభలలో ప్రాధాన్యం ఇవ్వరు. మొదటగా కరణీకాన్ని తొలగించి బ్రాహ్మణులకు గ్రామాల ప్రాధాన్యం లేకుండా చేసింది. అర్చక కులవృత్తిని కూడా తొలగించాలని కుట్ర చేస్తూ వయోపరిమితి తెచ్చింది. తరువాత వైఎస్సార్ మాత్రమే బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇచ్చారు. రాజకీయంగా చట్టసభలలో ప్రాధాన్యం ఇచ్చి వేల గుడులకు దూపదీప నైవేద్యాలు మంజూరు చేశారు. అదే కోవలో జగన్ బ్రాహ్మణులకు 4 అసెంబ్లీ సీట్లిచ్చి బ్రాహ్మణ జాతిని ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటున్నారు. మేమంతా జగన్ వెంటే.
–ఎంఎల్‌ఎన్ సురేష్‌బాబు, వైఎస్సార్ బ్రాహ్మణ అధ్యయన కమిటీ రాష్ట్ర సభ్యుడు, కడప
విద్యార్థులకు మేలు
విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్ సౌకర్యాలకు ప్రస్తుతం ఉన్న వార్షికాదాయం పరిమితి రూ.లక్ష నుంచి 3 లక్షలకు పెంచుతానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో బ్రాహ్మణ విద్యార్థులు ఉన్నత చదువు అభ్యసించేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
–శ్రీధర వెంకటేష్, పురోహితుడు, కడప
టీడీపీ హామీలు విస్మరించింది
2014 ఎన్నికలలో టీడీపీ మేనిఫెస్టోలో బ్రాహ్మణ డిక్లరేషన్ అంశాలలో శివార్చకులను బీసీ డీగా చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చారు. అయినా ఇప్పటికీ పట్టించుకోలేదు.–గుండ్లమూడి సత్యనారాయణశర్మ, రాష్ట్ర బ్రాహ్మణ సంఘం సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి, కడప
ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు
అర్హులైన పేద బ్రాహ్మణులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని జగన్ ఇచ్చిన హామీ హర్షణీయం. జగన్ పేదల కష్టాలు తెలిసిన, దక్షత కలిగిన నాయకుడు. ఆయనను ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. – శివస్వామి, పుల్లంపేట
రాజన్నపాలనలో అభివృద్ధి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే బ్రాహ్మణుల అభివృద్ధికి మొదటి అడుగు పడింది. ఆలయాలలో దూప దీప నైవేద్యానికి కంకణం కట్టారు. నేడు చాలా ఆలయాలలో నిత్యం పూజలు జరుగుతున్నాయంటే ఆయన ఘనతే. జగన్ కూడా ఆయన అడుగుజాడలలో బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేయడం ఆనందించదగ్గ విషయం.–ఎస్.రవికుమార్‌శర్మ, నందలూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment