
పర్లాకిమిడి: స్థానిక శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయంలో దుర్గానవరాత్రి ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రత్యేక మండపంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. ప్రముఖ పండితులు వనమాలి మణిశర్మ ఆధ్వర్యంలో మహిళలు కుంకుమ పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి దుర్గానవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు.
తొలిరోజు శ్రీబాల త్రిపురాసుందరిదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పర్లాకిమిడి వస్త్రవ్యాపారులు బరాటం నాగేశ్వరరావును కె.నారా యణరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేడీ యూత్ ప్రెసిడెంటు పిన్నింటి కృష్ణ తదితరులు విచ్చేశారు.