
ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తున్న కమిషనర్ వైవీ అనూరాధ
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గగుడి ఈవోగా దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధ ఆదివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి చేరుకున్న వైవీ అనూరాధకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి ప్రసాదాలు ఇచ్చారు. అనంతరం ఆమె రాజగోపురం ఎదురుగా ఉన్న వీఐపీ లాంజ్‌లో ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తూ ఫైల్‌పై సంతకాలు చేశారు. బ్రాహ్మణవీధిలోని ఇంద్రకీలాద్రి పరిపాలనా భవనానికి చేరుకున్నారు.