
ప్రతీకాత్మక చిత్రం
భోపాల్ : ఆధునిక కాలంలో కూడా మూఢనమ్మకాలతో ప్రజలు తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న సంఘటనలు కోకొల్లలు. దేవతపై నమ్మకంతో భక్తి పేరిట ఓ మహిళ తన నాలుకను కోసి నైవేద్యంగా సమర్పించింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని తార్సామా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుడ్డీ తోమర్ అనే 45 ఏళ్ల వివాహిత దుర్గా మాతకు పరమ భక్తురాలు. తార్సామా గ్రామంలో ఉన్న బిజసేన్ మాత ఆలయాన్ని ప్రతి రోజూ సందర్శించడం ఆమెకు అలవాటు.
ఈ క్రమంలోనే బుధవారం ఆలయానికి వెళ్లిన తోమర్ తన నాలుకను కోసి అమ్మవారికి నైవేద్యంగా అర్పించింది. ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోవడంతో పక్కనే ఉన్న ఇతర భక్తులు ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. దేవుడిపై విశ్వాసాన్ని నిరూపించుకోవడానికే ఆమె ఇలా ప్రవర్తించిందని.. ప్రస్తుతం చికిత్స పొందుతోందని పేర్కొన్నారు.
పెళ్లైన నాటి నుంచి అంతే..
ఈ ఘటనపై తోమర్ భర్త రవి తోమర్ మాట్లాడుతూ.. తన భార్య దుర్గాదేవి భక్తురాలని చెప్పారు. పెళ్లైననాటి నుంచి ఆమె ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం బిజసేన్ ఆలయానికి వెళ్తుందని తెలిపారు. అయితే బుధవారం కూడా ఆలయానికి వెళ్లిందని.. ప్రార్థనా సమయంలో అకస్మాత్తుగా ఇలా ఎందుకు చేసిందో తెలియడం లేదని వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment