శరన్నవరాత్రులకు నగరం అన్నివిధాలుగా సిద్ధమవుతోంది. స్థానికులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దుర్గామాత పూజకోసం పందిళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. చివరిరోజు రోజు జరిగే రావణ దహనం కోసం దుకాణదారులు ప్రతిమల తయారీలో తలమునకలయ్యారు.
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో అప్పుడే దసరా పండుగ సందడి నెలకొంది. ఎక్కడచూసినా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో స్థానికులు నిమగ్నమయ్యారు. నవరాత్రుల సమయంలో గర్భా వేడుకల కోసం కొన్ని చోట్ల, రామ్‌లీలా ప్రదర్శనల కోసం అనేకచోట్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు దుర్గామాత పూజ కోసం పందిళ్లు రూపుదిద్దుకుంటన్నాయి. ఈ ఏర్పాట్లన్నీ ఒక ఎత్తయితే విజయదశమి నాటి సాయంత్రం రావణ దహనానికి జరిగే ఏర్పాట్లు మరొక ఎత్తు.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే రావణ కుంభకర్ణ మేఘనాధుల దహనంతో పది రోజుల పండుగ సంబరాలు ముగుస్తాయి. ఈ వేడుక కోసం రావణ ప్రతిమల తయారీ ఠాగూర్ గార్డెన్ మెట్రో స్టేషన్‌కు దగ్గరలోనున్న తీతార్‌పుర్‌లో జోరుగా జరుగుతోంది. గ్రామంలో ఎక్కడ చూసినా రకరకాల రంగుల్లో, రకరకాల పరిమాణాల్లో తయారవుతున్న రావణ ప్రతిమలు కనిపిస్తున్నాయి. దసరా సమయంలో రావణ దహనం కోసం ప్రతిమలను తయా రు చేయడంలో తీతార్‌పుర్ గ్రామానికి చెందిన 40 కుటుంబాలకు ఎంతో అనుభవముంది. ప్రతి సంవత్సరం దసరాకు రెండు నెలల ముందు నుంచి రావణ ప్రతిమల తయారీని ప్రారంభిస్తామని వారు చెప్పారు.
తీతార్‌పుర్ నుంచి రావణ ప్రతిమలు ఇంగ్లండ్, అమెరికా, కెనడా తదితర దేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. ఐదు అడుగుల నుంచి మొదలుకుని 70 అడుగలు ఎత్తు కలిగిన రావణ ప్రతిమలను ఇక్కడ రూపొందిస్తున్నారు. ప్రతిమ ఎత్తును బట్టి ధర ఉంటుంది. అడుగుకు 300 రూపాయల చొప్పున ప్రతిమలను తయారుచేస్తున్నట్లు దుకాణదారులు చెప్పారు. 20 అడుగుల రావణ ప్రతిమకు రూ. ఆరు వేలు, 30 అడుగులైతే రూ. తొమ్మిది వేలు తీసుకుంటున్నట్లు దుకాణాదారులు తెలిపారు. డిజైన్‌ను బట్టి కూడా వీటిధర మారుతుందని వార ంటున్నారు. కొందరు కస్టమర్ల డిమాండ్ మేరకు ఒకవేళ వర్షం కురిసినా తడవకుండా ఉండడం కోసం వాటర్‌ప్రూఫ్ ప్రతమిలనుతయారుచేసుత్నట్లు వారు చెప్పారు.ఇంకా ఇవేకాకుండా సిక్స్ ప్యాక్ ప్రతిమలను తయారు చేయాలంటూ కొందరు కోరుతున్నారు. రావణుడికి క్రికెటర్ శిఖర్ ధావన్ స్టైలు మీసాలు కావాలని అడిగే కస్టమర్లు కూడా ఉన్నారని ప్రతిమల తయారీదారులు చెప్పారు.
దసరా సందడి
Published Mon, Sep 22 2014 10:26 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
Advertisement
Advertisement