కోల్‌కతా: గత కొంత కాలంగా భారత్‌కు, చైనాకు అస్సలు పడటం లేదు. ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో తయారు చేసి వదిలారని పలు దేశాలు డ్రాగన్ దేశంపై ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. కొందరు శాస్త్రవేత్తలు సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. దీంతో భారతీయులు కూడా చైనాను దోషిగా వేలెత్తి చూపారు. ఇక్కడితో చాలదన్నట్టు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేస్తోంది చైనా. దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మన భారత సైనికులను పొట్టన పెట్టుకుని యుద్ధానికి కాలు దువ్వుతోంది. ఇక అప్పటి నుంచి ఇండియాలో చైనాపై వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరింది. ఆ దేశ వస్తువులను బహిష్కరించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపించింది. (చదవండి: యూట్యూబ్‌లో దూసుకుపోతున్న కలెక్టర్ భక్తి పాట)
అయితే చైనాపై ఉన్న వ్యతిరేకతను దసరా శరన్నవరాత్రుల్లో వైవిధ్యంగా చూపించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ విగ్రహం తల నరికి వేసి దుర్గామాత కాళ్ల దగ్గర పడేశారు. అదెలాగంటే.. పశ్చిమ బెంగాల్‌లో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ క్రమంలో అక్కడి బెర్హంపూర్‌లో ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా దుర్గాదేవిని ప్రతిష్టించారు. అమ్మవారి చేతిలో హతమైన రాక్షసుడి స్థానంలో రక్తం కక్కుతున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బొమ్మను ఉంచారు. ఇది దుర్గా దేవి పాదాల కింద ఉంచారు. అమ్మవారి వాహనమైన సింహం దాని మొండాన్ని తినేస్టున్నట్లుగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక ఈ విగ్రహం క్రెడిట్ అంతా ఆర్టిస్ట్ అషిమ్ పాల్‌కే చెందుకుతుంది. (చదవండి: బుద్ధం శరణం గచ్ఛామి!)
Comments
Please login to add a commentAdd a comment