Puja pandals
-
వైరల్: జిన్‌పింగ్ తల దుర్గమ్మ కాళ్ల దగ్గర!
కోల్‌కతా: గత కొంత కాలంగా భారత్‌కు, చైనాకు అస్సలు పడటం లేదు. ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో తయారు చేసి వదిలారని పలు దేశాలు డ్రాగన్ దేశంపై ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. కొందరు శాస్త్రవేత్తలు సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. దీంతో భారతీయులు కూడా చైనాను దోషిగా వేలెత్తి చూపారు. ఇక్కడితో చాలదన్నట్టు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేస్తోంది చైనా. దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మన భారత సైనికులను పొట్టన పెట్టుకుని యుద్ధానికి కాలు దువ్వుతోంది. ఇక అప్పటి నుంచి ఇండియాలో చైనాపై వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరింది. ఆ దేశ వస్తువులను బహిష్కరించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపించింది. (చదవండి: యూట్యూబ్‌లో దూసుకుపోతున్న కలెక్టర్ భక్తి పాట) అయితే చైనాపై ఉన్న వ్యతిరేకతను దసరా శరన్నవరాత్రుల్లో వైవిధ్యంగా చూపించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ విగ్రహం తల నరికి వేసి దుర్గామాత కాళ్ల దగ్గర పడేశారు. అదెలాగంటే.. పశ్చిమ బెంగాల్లో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ క్రమంలో అక్కడి బెర్హంపూర్‌లో ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా దుర్గాదేవిని ప్రతిష్టించారు. అమ్మవారి చేతిలో హతమైన రాక్షసుడి స్థానంలో రక్తం కక్కుతున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బొమ్మను ఉంచారు. ఇది దుర్గా దేవి పాదాల కింద ఉంచారు. అమ్మవారి వాహనమైన సింహం దాని మొండాన్ని తినేస్టున్నట్లుగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక ఈ విగ్రహం క్రెడిట్ అంతా ఆర్టిస్ట్ అషిమ్ పాల్కే చెందుకుతుంది. (చదవండి: బుద్ధం శరణం గచ్ఛామి!) -
అందరికీ మంచి జరగాలని అమ్మవారిని ప్రార్థించా
-
దుర్గా మంటపంలో మహిళా ఎంపీ హల్చల్..
కోల్‌కతా : దసరా నవరాత్రులు బెంగాల్లో ఎంత వైభవంగా శోభాయమానంగా జరుగుతాయో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. దుర్గామాతను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే కోల్‌కతాలో దుర్గా మంటపాలు వినూత్న అలంకరణలతో ముస్తాబవుతాయి. నగరంలో సురుచి సంఘం ఏర్పాటు చేసిన మంటపంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహన్ ఆమె భర్త నిఖిల్ జైన్ ఆదివారం సందడి చేశారు. పూజా మంటపంలో డ్రమ్స్ వాయిస్తూ అక్కడున్న వారిలో ఉత్సాహం నింపారు. నుస్రత్ డ్రమ్స్ మోగిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
వార్నర్.. గంగూలీ ఇంటికి వెళ్లు..!
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి వన్డేకు, రెండో వన్డేకు మధ్య నాలుగు రోజుల గడువు దొరికింది. దీంతో సహజంగానే ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులతో రిలాక్స్ అవ్వడానికి టైం దొరికినట్టయింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ ఆసక్తికరమైన పోస్టును పెట్టాడు. కుటుంబసభ్యులతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి.. కోల్‌కతాలో సందర్శించడానికి గల ఉత్తమ ప్రదేశాలు ఏవంటూ నెటిజన్లను అడిగాడు. దీంతో ఆయనకు ఆసక్తికరమైన సమాధానాలు వచ్చాయి. దీంతో చాలామంది అభిమానులు .. గంగూలీ ఇంటిని సందర్శించమంటూ వార్నర్‌కు సూచించారు. 'కోల్‌కతా ప్రిన్స్'గా పేరొందిన గంగూలీ ఇంటిలో ఆతిథ్యం బాగుంటుందని పేర్కొన్నారు. ఇక, కోల్‌కతాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు హౌరాబ్రిడ్జి, శాంతినికేతన్, విక్టోరియా మెమోరియల్ తదితర ప్రాంతాలను సందర్శించాలని పలువురు నెటిజన్లు సూచించారు. ఇక బెంగాల్లో దుర్గా నవరాత్రి ఉత్సవం అతిపెద్ద పండుగ. కాబట్టి దుర్గామత మండపాలను సందర్శించాలని మరికొందరు నెటిజన్లు సూచించారు. తొలి వన్డేలో విజయం సాధించిన భారత్.. గురువారం కోల్‌కతాలో జరగనున్న రెండో వన్డేకు రెట్టించిన ఉత్సాహం సిద్ధమైంది. అటు ఆసీస్ కూడా గెలుపు కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. Good morning from Kolkata, what's the best places to visit while we are here?? Please