
కోల్‌కతా : దసరా నవరాత్రులు బెంగాల్‌లో ఎంత వైభవంగా శోభాయమానంగా జరుగుతాయో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. దుర్గామాతను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే కోల్‌కతాలో దుర్గా మంటపాలు వినూత్న అలంకరణలతో ముస్తాబవుతాయి. నగరంలో సురుచి సంఘం ఏర్పాటు చేసిన మంటపంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహన్ ఆమె భర్త నిఖిల్ జైన్ ఆదివారం సందడి చేశారు. పూజా మంటపంలో డ్రమ్స్ వాయిస్తూ అక్కడున్న వారిలో ఉత్సాహం నింపారు. నుస్రత్ డ్రమ్స్ మోగిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment