కృష్ణా నదిలో మునిగి ఇద్దరు మృతి
Published Wed, Aug 24 2016 1:09 PM | Last Updated on Sat, Sep 29 2018 5:55 PM
అమరావతి : గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట వద్ద కృష్ణానదిలో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మహేవ్(27), దుర్గ(20)గా గుర్తించారు. అమరావతిలో స్థానికంగా ఉన్న ఓ స్వీట్ షాప్‌లో యువకులు పని చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Advertisement
Advertisement