దుర్గా పూజలో చెఫ్‌లుగా సెక్స్‌ వర్కర్లు | Sex Workers With Chef In Durga Puja | Sakshi
Sakshi News home page

దుర్గా పూజలో చెఫ్‌లుగా సెక్స్‌ వర్కర్లు

Published Sun, Sep 3 2017 12:47 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

దుర్గా పూజలో చెఫ్‌లుగా సెక్స్‌ వర్కర్లు - Sakshi

దుర్గా పూజలో చెఫ్‌లుగా సెక్స్‌ వర్కర్లు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో దుర్గా నవరాత్రుల సందర్భంగా సెక్స్‌ వర్కర్లు చెఫ్‌ల టోపీలు ధరించనున్నారు. ఆసియాలోనే అతి పెద్ద రెడ్‌లైట్‌ ఏరియా అయిన సోనాగచ్చి నగరంలోని సెక్స్‌ వర్కర్లు దుర్గా పూజ సందర్భంగా మత్స్యశాఖ ఏర్పాటు చేయనున్న ఫుడ్‌ కోర్టుల్లో చెఫ్‌గా పనిచేయనున్నారు. సెక్స్‌వర్కర్లకు ఆ వృత్తి నుంచి విముక్తి కల్పించి వారి అభివృద్ధికి తోడ్పడుతున్న దర్బార్‌ మహిళా సమన్వయ కమిటీ(డీఎంఎస్‌సీ), ఎన్‌జీవో సంస్థలు ఈ ప్రాజెక్టుపై షెఫ్‌లుగా శిక్షణ ఇచ్చేందుకు ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో ఒక అవగాహనకు వచ్చాయి.

డీఎంఎస్‌సీ కింద రిజిస్టర్‌ అయిన వారిలో 1.30 లక్షల మంది సెక్స్‌వర్కర్లు ఉన్నారు. దుర్గా పూజా సమయంలో కోల్‌కతాలోని వివిధ ప్రదేశాల్లో ఎనిమిది, బెంగళూరులో రెండు ఫుడ్‌ పెవిలియన్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అధిక శాతం మందిని బెంగళూరు పంపనున్నట్లు తెలిపారు. తమకు వంటవారు(కుక్‌)లు అవసరం ఉందని, డీఎంఎస్‌సీని సంప్రదించగా వారు అంగీకరించారని ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ తెలిపింది. సజీవంగా ఉన్న చేపల ప్యాకేజీ, వాటి వంటకాల్లో ఈ సెక్స్‌వర్కర్లకు శిక్షణ ఇస్తామని కార్పొరేషన్‌ ఎండీ సౌమ్యజిత్‌ తెలిపారు. సోమవారం నుంచి ఈ శిక్షణ ఇవ్వనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement