9వ రోజు (నేడు దుర్గాష్టమి) అలంకారం దుర్గాదేవి | durgashtami festivel special story | Sakshi
Sakshi News home page

9వ రోజు (నేడు దుర్గాష్టమి) అలంకారం దుర్గాదేవి

Published Sun, Oct 9 2016 12:34 AM | Last Updated on Sat, Sep 29 2018 5:55 PM

9వ రోజు (నేడు దుర్గాష్టమి) అలంకారం దుర్గాదేవి - Sakshi

9వ రోజు (నేడు దుర్గాష్టమి) అలంకారం దుర్గాదేవి

శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారిని పులివాహనంపై కత్తి, త్రిశూలం చేబూని దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేయడానికి అవతరించిన దుర్గాదేవి నిజరూపంగా భక్తులకు దర్శనమిస్తుంది.

లోకభయంకరుడైన రురువు కుమారుడు దుర్గముణ్ణి సంహరించిన తరువాత పరాశక్తి ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిందని పురాణ గాథ. ఎందరో రాక్షసులను సంహరించిన దుర్గాదేవిని దుర్గాష్టమి రోజున దర్శించుకుంటే దుర్గతులనుండి తప్పించుకోగలుగుతారనేది భక్తుల విశ్వాసం.

శ్లోకం:   సర్వ స్వరూప సర్వేశీ సర్వశక్తి సమన్వితే! భయేభ్యః ప్రాహివో దేవి దుర్గేదేవి నమోస్తుతే!!
భావం:  దుష్టశిక్షణ చేయడానికి అవతరించి సర్వభయాలనూ పారద్రోలు దుర్గాస్వరూపమైన అమ్మా! నీకు నమస్సులు.
ఫలమ్: శత్రుబాధలు తొలగిపోయి సకల కార్యములయందు విజయం పొందుతారు.
నివేదన:     పేలాలు, వడపప్పు, పాయసం
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement