వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌లో పారిస్ నగరం బెస్ట్ | work life balance: france bags first rank in europe | Sakshi
Sakshi News home page

వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌లో పారిస్ నగరం బెస్ట్

Published Mon, Jul 4 2016 4:19 PM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌లో పారిస్ నగరం బెస్ట్

వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌లో పారిస్ నగరం బెస్ట్

పారిస్: కష్టపడి పనిచేసే గంటలు, తీసుకునే విశ్రాంతికి మధ్య సమతౌల్యత సరిగ్గా పాటించినప్పుడే ఓ ఉద్యోగి తన జీవితాన్ని ఉల్లాసంగా, ఆహ్లాదకరంగా గడపగలరు అనేది ఓ అవగాహన. ఈ అవగాహన యూరప్‌లోని ఏ దేశ ఉద్యోగుల్లో ఎక్కువగా ఉంది? ఏ దేశ ఉద్యోగుల్లో తక్కువగా ఉంది? అంటే, ‘వర్క్-లెఫ్ బ్యాలెన్స్’ ఎలా ఉందనే అంశంపై ‘ఆన్‌లైన్ బిజినెస్ టు బిజినెస్ మార్కెట్ ప్లేస్’లో అనభవం కలిగిన ఎక్స్‌పర్ట్ మార్కెట్ సంస్థ వివిధ దేశాల డేటాను విశ్లేషించి 13 నగరాలకు ర్యాంకింగ్‌లు కేటాయించింది. 
 
వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అంటే పనిచేసే గంటలకు, విశ్రాంతి తీసుకునే గంటలకు మధ్య బ్యాలెన్స్ ఎలా పాటిస్తున్నారన్నదే ప్రధాన అంశం. ఈ అంశంలో తక్కువ గంటలు పనిచేస్తూ ఎక్కువ గంటలు విశ్రాంతి తీసుకుంటున్న నగారాలను ఉత్తమ బ్యాలెన్సింగ్ కింద పరిగణించి ర్యాంకింగ్‌లను కేటాయించారు. యూరప్‌లో ఎంపిక చేసిన 13 నగరాల్లో రెండు ఉత్తమ వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ నగరాలు ఫ్రాన్స్ దేశానికి చెందినవే కావడం విశేషం. 
 
1. ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలో ఓ ఉద్యోగి వారానికి 30.84 గంటలు, ఏడాదికి 1603.8 గంటలు పనిచేస్తారు. ఏడాదికి 28 రోజులు సెలవు తీసుకుంటారు. ఇది ప్రపంచంలో ఓ ఉద్యోగి పనిచేసే సరాసరి సగటు కాలానికి 18 శాతం తక్కువ.
 
2. ద్వితీయ స్థానానికి ఎంపికైన నగరం ఫ్రాన్స్‌లో లియాన్. ఈ నగరంలో వారానికి 31.36 గంటలు, ఏడాదికి 1630 గంటలు పనిచేస్తారు. ఏడాదికి 28.5 సెలవులు తీసుకుంటారు. 

3. రష్యాలోని మాస్కో నగరంలో వారానికి 31.66 గంటలు, ఏడాదికి 1648 గంటలు పనిచేస్తారు. ఏడాదికి 31 రోజులు సెలవు తీసుకుంటారు. 

4. ఫిన్‌లాండ్‌లోని హెల్సింకిలో వారానికి 31.91 గంటలు పనిచేస్తారు. ప్రపంచ సరాససరి సగటు పని గంటలకన్నా 14 శాతం తక్కువ. 

5. ఆస్ట్రియాలోని వియన్నాలో వారానికి 32.27 గంటలు, ఏడాదికి 1678 గంటలు పనిచేస్తారు. ఏడాదికి 27 రోజులు సెలవు తీసుకుంటారు. 

6. ఇటలీలోని మిలన్ నగరంలో 32.52 గంటలు పనిచేస్తారు. ప్రపంచ సరాసరి సగటు పని గంటలకన్నా 12 శాతం తక్కువ పనిచేస్తారు. 

7. డెన్మార్క్‌లోని కోపెన్‌హగన్ నగరంలో వారానికి 32.54 గంటలు పనిచేస్తారు. ప్రపంచ సరాససరి సగటు గంటల్లో 11. 4 శాతం తక్కువ పనిచేస్తారు. 
 
8. లగ్జంబర్గ్‌లోని లగ్జంబర్గ్ నగరంలో వారానికి 32.75, ఏడాదికి 1703 గంటలు పనిచేస్తారు. ఏడాదికి 31 రోజులు సెలవు తీసుకుంటారు. 

 9. లుథానియా రాజధాని విల్నియస్‌లో వారానికి 33 గంటలు పనిచేస్తారు. 

10. బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో వారానికి 33.02 గంటలు, ఏడాదికి 1717 గంటలు పనిచేస్తారు. ఏడాదికి కేవలం 18 రోజులు సెలవు తీసుకుంటారు. 

11. జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో వారానికి 33.1 గంటలు పనిచేస్తారు. 29 రోజులు సెలవు తీసుకుంటారు. 

12. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో వారానికి 33.20 గంటలు, ఏడాదికి 1726 గంటలు పనిచేస్తారు. 

13. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో వారానికి 33.28 గంటలు పనిచేస్తారు. ఎక్కువ ఉష్ణోగ్రత కారణంగా వారు మధ్యాహ్నం ఓ కునుకు తీస్తారు. అందుకని వారి పనిగంటల్లో భారీ కోత పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement