
కేంద్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్‌ను కేబినెట్ కొత్త సెక్రటరీగా శనివారం నియమించింది. ఆగష్టు 30 నుంచి రెండేళ్లపాటు కేబినెట్ సెక్రటరీ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.
కాగా సోమనాథన్ 1987 బ్యాచ్‌కు చెందిన తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం సోమనాథన్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అంతక ముందు ప్రధాన మంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శి, జాయింట్ సెక్రటరీగా పనిచేశాడు. అంతేగాక వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ గ్రూపులో డైరెక్టర్‌గా పనిచేశాడు.
కాగా ప్రస్తుతం జార్ఖండ్ కేడర్‌కు చెందిన 198 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ గౌబా 2019 నుంచి భారత కేబినెట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అతని పదవీకాలాన్ని సంవత్సర కాలం వ్యవధితో ఇప్పటి వరకు 4 సార్లు పొడిగించారు.
కేబినెట్ సెక్రటరీ.. అనేది అత్యున్నత స్థాయి కార్యనిర్వాహక అధికారి. సివిల్ సర్వీసెస్‌లో సీనియర్ మోస్ట్ పదవి. వీరు నేరుగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తారు. వివిధ మంత్రిత్వ శాఖలలో వ్యాపార లావాదేవీలను సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వ పరిపాలనకు బాధ్యత వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment