senior IAS officer
-
ఏఏఐ చైర్మన్‌గా విపిన్ కుమార్
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి విపిన్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1996 బ్యాచ్ బిహార్ క్యాడర్‌కు చెందిన ఆయన ఈ పదవిలోకి రాక ముందు కేంద్ర విద్యాశాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. బిహార్‌లో జిల్లా మెజి్రస్టేట్‌గా, బిహార్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ చైర్మన్‌గానూ విధులు నిర్వర్తించారు. ఏఏఐ పూర్తి స్థాయి చైర్మన్ సంజీవ్ కుమార్ డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. ఏఏఐ సభ్యులు ఎం.సురేశ్ తాత్కాలిక చైర్మన్‌గా ఇప్పటి వరకు వ్యవహరించారు. మినీ రత్న అయిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 137 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. -
కేంద్ర కేబినెట్ కొత్త కార్యదర్శిగా టీవీ సోమనాథన్
కేంద్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్‌ను కేబినెట్ కొత్త సెక్రటరీగా శనివారం నియమించింది. ఆగష్టు 30 నుంచి రెండేళ్లపాటు కేబినెట్ సెక్రటరీ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.కాగా సోమనాథన్ 1987 బ్యాచ్‌కు చెందిన తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం సోమనాథన్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అంతక ముందు ప్రధాన మంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శి, జాయింట్ సెక్రటరీగా పనిచేశాడు. అంతేగాక వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ గ్రూపులో డైరెక్టర్‌గా పనిచేశాడు. కాగా ప్రస్తుతం జార్ఖండ్ కేడర్‌కు చెందిన 198 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ గౌబా 2019 నుంచి భారత కేబినెట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అతని పదవీకాలాన్ని సంవత్సర కాలం వ్యవధితో ఇప్పటి వరకు 4 సార్లు పొడిగించారు.కేబినెట్ సెక్రటరీ.. అనేది అత్యున్నత స్థాయి కార్యనిర్వాహక అధికారి. సివిల్ సర్వీసెస్‌లో సీనియర్ మోస్ట్ పదవి. వీరు నేరుగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తారు. వివిధ మంత్రిత్వ శాఖలలో వ్యాపార లావాదేవీలను సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వ పరిపాలనకు బాధ్యత వహిస్తారు. -
మహారాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా సుజాతా సౌనిక్ రికార్డు
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి సుజాతా సౌనిక్ నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారి నితిన్ కరీర్ పదవీ విరమణ అనంతరం సుజాతా సౌనిక్‌కు బాధ్యతలు అప్పగించారు. దక్షిణ ముంబైలోని రాష్ట్ర సచివాలయం మంత్రాలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సౌనిక్ బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర చరిత్రలో అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. 1987 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సుజాత మరో ఏడాది పాటు పదవిలో ఉంటారు. ఆమె భర్త మనోజ్ సౌనిక్ కొన్నేళ్ల క్రితం ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఇప్పుడు రాష్ట్ర హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. -
వైఎస్ఆర్ సీపీలో చేరిన సీనియర్ ఐఎఎస్ అధికారి ఎండి ఇంతియాజ్
-
పోంజి కుంభకోణం.. ఐఏఎస్ ఆత్మహత్య
బెంగళూరు : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఎంఎ పోంజి కుంభకోణంలో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి బీఎం విజయ్ శంకర్ ఆత్మహత్య చేసుకున్నారు.బెంగళూరులోని జయానగర్‌లో ఉన్న తన నివాసంలో విజయ శంకర్ మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. రూ. 4 వేల కోట్ల ఐఎంఎ పోంజి కుంభకోణంలో విజయ్ శంకర్ భారీ మొత్తంలో లంచం తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయమై 2019లో కుమారస్వామి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సిట్ విజయ్ శంకర్‌ను అరెస్టు చేసింది. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ కేసును సీబీఐకి అప్పగించింది. కాగా సీబీఐ ఈ కేసులో విజయ్ శంకర్‌తో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులను విచారించేందుకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని కోరింది.(పొట్టిగా ఉందని..మట్టుబెట్టాడు!) 2013లో పెద్ద మొత్తంలో రిటర్న్స్‌ను ఇస్తామని పేర్కొంటూ మహ్మద్ మన్సూర్ ఖాన్ పోంజి స్కీమ్‌కు తెరలేపాడు. వేలాదిమంది అమాయకుల నుంచి రూ. 4 వేల కోట్లను సేకరించాడు. దీనిపై అప్పట్లో ఆదాయపుపన్ను శాఖ, ఆర్బీఐ దృష్టిసారించింది. ఐఎంఏపై విచారణ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్బీఐ కోరింది. అందుకు నివేదిక తయారు చేసి రిపోర్ట్ సమర్పించవలసిందిగా ప్రభుత్వం విజయ్ శంకర్‌ను కోరింది.బెంగళూరు అసిస్టెంట్ కమిషనర్ ఎల్సీ నాగరాజ్‌తో కలిసి విజయ్ శంకర్ నివేదికను తయారు చేశాడు. ఈ క్రమంలోనే కేసును పక్కదారి పట్టించేందుకు విజయశంకర్, నాగరాజ్ రూ.1.5 కోట్లను లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలపై లంచం ఆరోపణలు చేసి మహ్మద్ మన్సూర్ ఖాన్ దుబాయ్‌కి పారిపోయాడు. గతేడాది జులై 19న మన్సూర్ ఢిల్లీకి తిరిగి రావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కాగా ఖాన్‌తో పాటు ఐఎంఎలో ఉన్న ఏడుగురు డైరెక్టర్లను, ఓ కార్పొరేటర్‌తో పాటు పలువురిని అప్పట్లో సిట్ అధికారులు అరెస్టు చేశారు. (టెక్కీని మోసగించిన కి'లేడీ') -
ద్వివేదికి జాతీయ స్థాయి పురస్కారం
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రానికి చెందిన మాజీ ఎన్నికల ప్రధానాధికారి, సీనియర్ ఐఎఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి జాతీయస్థాయి పురస్కారం లభించింది. రాష్ట్రంలో గత ఏడాది జరిగిన ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గానూ ఉత్తమ ఎన్నికల నిర్వహణ కేటగిరిలో ఆయన ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని జొరావర్ ఆడిటోరియంలో శనివారం జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదిగా ఉత్తమ ఎలక్షన్ సిఈవో అవార్డును అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా... స్వేచ్ఛాయుతంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల యంత్రాంగాన్ని గోపాలకృష్ణ ద్వివేది నడిపించారు. ప్రజాస్వామికంగా ఎన్నికల కమిషన్ నిబంధనలను పకడ్భందీగా అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల ప్రధాన అధికారిగా గోపాలకృష్ణ ద్వివేది తీసుకున్న నిర్ణయాలు, అయన అనుసరించిన విధానాలకు గానూ జాతీయస్థాయిలో ఈ పురస్కారం లభించింది. ప్రస్తుతం గోపాలకృష్ణ ద్వివేది రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా ఈ పురస్కారాన్ని అందుకున్న గోపాలకృష్ణ ద్వివేదికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. -
సీనియర్ ఐఏఎస్ టీఎల్ శంకర్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారి, భారత విద్యుత్ రంగ నిపుణుడు, పద్మభూషణ్ టీఎల్ శంకర్ (84) బుధవారం సాయంత్రం కన్నుమూశారు. కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1957 సివిల్ సర్వీస్ బ్యాచ్‌కు చెందిన శంకర్ దేశంలో విద్యుత్ (ఎనర్జీ) రంగ నిపుణుడిగా, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్‌గా, రాష్ట్ర విద్యుత్ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. 1975లో ఇంధన విధాన నిర్ణయ కమిటీ సభ్యుడిగా, హిందుస్తాన్ పెట్రోలియం బోర్డు డైరెక్టర్‌గా సేవలందించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్సార్ శంకరన్‌తో కలిసి చదువుకున్నారు. ఇదిలా ఉండగా విదేశాల్లో స్థిరపడ్డ శంకర్ కుటుంబసభ్యులు హైదరాబాద్ చేరుకున్నాక శనివారం ఉదయం సాగర్ సొసైటీలోని ఆయన నివాసం నుంచి అంతిమ యాత్ర మొదలవుతుందని, మహాప్రస్థానంలో తుది కార్యక్రమాలు నిర్వహిస్తామని సన్నిహితులు తెలిపారు. సీఎం సంతాపం.. టీఎల్ శంకర్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాగా, శంకర్ మృతిపై ఆస్కీ చైర్మన్ పద్మనాభయ్య, సీనియర్ ఐఏఎస్ కేఆర్ వేణుగోపాల్, కాకి మాధవరావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. దేశంలో వివిధ రంగాల అభ్యు న్నతి కోసం శంకర్ చేసిన కృషిని వారు కొనియాడారు. -
మహారాష్ట్రలో ఐఏఎస్ అధికారి అరెస్ట్
పుణే: బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి తన వయసును కూడా మరచి చిన్నారులపై నీచపు పనికి ఒడిగట్టిన సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యవసాయ విద్య, పరిశోధన మండలి డెరైక్టర్ జనరల్‌గా ఉన్న 58 ఏళ్ల ఎం.హెచ్ సావంత్ పుణేలో నివాసం ఉంటున్నాడు. ఓ పాఠశాల పక్కనే అపార్ట్మెంట్లో ఉండే తన మామ ఇంటికి తరచూ వచ్చే సావంత్ అక్కడి మైదానంలో ఆడుకునే బాలికలపై కన్నేశాడు. వారికి చాక్లెట్లు, డబ్బు ఎరచూపి మాయమాటలతో వారి దగ్గరకు చేరి పదేళ్లలోపు వయసున్న నలుగురు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారిపై అఘాయిత్యానికి ఒడిగట్టేముందు తన కంప్యూటర్లో అశ్లీల చిత్రాలను చూపించేవాడు. ఈ విషయాన్ని పిల్లలు ఇటీవలే తమ స్కూల్ టీచర్‌కు తెలపడంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం సావంత్‌ను అరెస్టు చేశారు. కోర్టు ఈనెల 30 వరకు ఆయనకు పోలీసు కస్టడీ విధించింది.