కీవ్: రష్యాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు. ఉక్రెయిన్ భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ పర్యటనలో లాయిడ్ ఆస్టిన్ ఉక్రేనియన్ నేతలతో ఉన్నత స్థాయి చర్చల్లో పాల్గొంటారు.
I’m back in Ukraine for the fourth time as Secretary of Defense, demonstrating that the United States, alongside the international community, continues to stand by Ukraine. pic.twitter.com/0gCwAqqEpK
— Secretary of Defense Lloyd J. Austin III (@SecDef) October 21, 2024
తన పర్యటన సందర్భంగా ఆస్టిన్ ఒక ట్విట్టర్ పోస్టులో ‘అంతర్జాతీయ సమాజంతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తుందని తెలియజేయడానికే తాను నాల్గవసారి ఉక్రెయిన్‌కు తిరిగి వచ్చానని’ తెలిపారు. మరోవైపు రక్షణ కార్యదర్శి లాయిడ్ జె. ఆస్టిన్ III ఉక్రెయిన్‌కు చేరుకున్నారని, ఉక్రెయిన్ స్వాతంత్ర్య పోరాటానికి యునైటెడ్ స్టేట్స్ మద్దతును పునరుద్ఘాటించారని పెంటగాన్ ఒక ప్రకటనలో పేర్కొంది. రష్యా దురాక్రమణ నుండి ఉక్రెయిన్‌కు అవసరమైన భద్రతా సహాయాన్ని అందించడానికి యూఎస్ కట్టుబడి ఉందని పెంటగాన్ తెలిపింది.
ఇది కూడా చదవండి: యాహ్యా సిన్వార్ మృతి.. హమాస్‌కు చీఫ్ లేనట్లే!
Comments
Please login to add a commentAdd a comment