సాక్షి,న్యూఢిల్లీ : ఐదేళ్లు సుదీర్ఘ కాలం తర్వాత ప్రధాని మోదీ.. రష్యాలో పర్యటించనున్నారు. జులై 8,9 ఈ రెండు రోజుల పాటు రష్యాలో జరిగే భారత్-రష్యాల 22వ వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అభివృద్దిపై చర్చ జరగనుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.
రష్యా పర్యటన అనంతరం మోదీ ఆస్ట్రియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనతో 40ఏళ్ల చరిత్రలో భారత ప్రధాని తొలిసారి సందర్శించిన ఘనత దక్కనుంది.
మోదీ చివరి సారిగా 2019లో రష్యా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో వ్లాడివోస్టోక్ నగరంలో నిర్వహించిన ఎకనమిక్స్ కంక్లేవ్‌లో పాల్గొన్నారు. తాజాగా మరోసారి రష్యాలో సందర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment