న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయన జైలు నుంచి బయటకు రాగానే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నేతలు, మద్దతుదారులలో ఉత్సాహం కనిపించింది. వర్షంలో తడుస్తూనే వారంతా కేజ్రీవాల్‌కు స్వాగతం పలికారు.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12 గంటలకు హనుమాన్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆయనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా హాజరుకానున్నారు. సీఎం హనుమాన్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, పూజలు చేయనున్నారు.
శుక్రవారం భారీ వర్షం కురుస్తున్నప్పటికీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు స్వాగతం పలికేందుకు తీహార్ జైలు వెలుపల అభిమానులు గుమిగూడారు. కేజ్రీవాల్‌కు ఆప్ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. డప్పుల దరువులు, నృత్యాలు, కేజ్రీవాల్‌కు మద్దతుగా పలికే నినాదాల మధ్య ఆ ప్రాంతమంతా ఉత్సాహంతో నిండిపోయింది. కేజ్రీవాల్‌కు మద్దతుగా పలు నినాదాలతో కూడిన పోస్టర్లు, బ్యానర్‌లను అభిమానులు ప్రదర్శించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా పార్టీ సీనియర్ నేతలు తదితరులు సీఎం కేజ్రీవాల్‌కు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: ఆ కూడలికి భగత్ సింగ్ పేరు పెట్టండి: పాక్ కోర్టు
Comments
Please login to add a commentAdd a comment