
శ్రీదేవి ముద్దుల కూతురు, దేవర భామ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవల అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మెరిసిన ముద్దగుమ్మ ఇవాళ తన 27వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్‌కు పలువురు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగ పోస్టులు పెడుతున్నారు.


















