
అయోధ్యలో రామమందిరం ప్రారంభమై నెల రోజులు గడిచింది. జనవరి 22న బాలరాముడు గర్భగుడిలో కొలువయ్యాడు. అయోధ్యకు రామభక్తుల ప్రవాహం నిరంతరం కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షలాది మంది రామభక్తులు తమ ఆరాధ్య దైవాన్ని సందర్శించుకుంటున్నారు.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు అంటే జనవరి 22 నుండి ఇప్పటి వరకు దాదాపు 60 లక్షల మంది రామభక్తులు రామ్‌లల్లాను దర్శించుకున్నారు. ఆలయం ప్రారంభమైన మొదటి 10 రోజుల్లో 25 లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించుకున్నారు.
గడచిన నెల రోజుల్లో వివిధ పార్టీల నేతలే కాకుండా బాలీవుడ్ తారలు కూడా ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫిబ్రవరి 11న దాదాపు 300 మంది శాసనసభ సభ్యులతో కలిసి రామమందిరాన్ని సందర్శించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా తన మంత్రివర్గంతో కలిసి బాలరాముణ్ణి దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment