న్యూఢిల్లీ: రష్యాలో నేడు, రేపు(అక్టోబర్ 22, 23) జరిగే 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలోని కజాన్ నగరానికి తరలివెళ్లారు. రష్యాలో ప్రధాని మోదీ పర్యటన రెండు రోజులపాటు సాగనుంది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.
#WATCH | PM Narendra Modi leaves from Delhi for Russia to attend the 16th BRICS Summit, being held in Kazan, under the Chairmanship of Russia.
The Prime Minister is also expected to hold bilateral meetings with his counterparts from BRICS member countries
(Source - ANI/DD) pic.twitter.com/opQmNl6oPR— ANI (@ANI) October 22, 2024
16వ బ్రిక్స్ సదస్సు ‘సమాన రీతిలో ప్రపంచ అభివృద్ధి- భద్రత కోసం బహుపాక్షికతను బలోపేతం చేయడం’ అనే అంశంపై జరగనుంది. కాగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ సందర్భంగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ వ్యవస్థాపక సభ్యులతో పాటు కొత్త సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అక్టోబరు 22న సమ్మిట్ ప్రారంభం కానున్నదని, తొలిరోజు సాయంత్రం నేతలకు విందు ఉంటుందన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో 23న ఉదయం క్లోజ్డ్ ప్లీనరీ, మధ్యాహ్నం ఓపెన్ ప్లీనరీ సెషన్ ఉంటుంది.
#WATCH | Russia: Visuals from Kazan; billboards put up by Indian diaspora to welcome PM Modi
Prime Minister Narendra Modi will visit Russia from 22-23 October 2024 at the invitation of Russian President Vladimir Putin, to attend the 16th BRICS Summit, which is being held in… pic.twitter.com/N5WHOl3Xrq— ANI (@ANI) October 21, 2024
బ్రిక్స్ సదస్సుకు ముందు భారత్, చైనాల మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. 2020 నుంచి కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే దిశగా ముందడుగు పడింది. రెండు దేశాల మధ్య సైనిక, దౌత్య స్థాయిలో కసరత్తుల తర్వాత, వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)పై పెట్రోలింగ్, సైనిక ఉద్రిక్తతను తగ్గించడానికి ఒప్పందం కుదిరింది.
#WATCH | Russia: Visuals from Kazan, ahead of the BRICS summit 2024
Prime Minister Narendra Modi will visit Russia from 22-23 October at the invitation of Russian President Vladimir Putin, to attend the 16th BRICS Summit, which is being held in Kazan, under the Chairmanship of… pic.twitter.com/fCKdFdT87B— ANI (@ANI) October 21, 2024
ఇదిలా ఉండగా ప్రధాని మోదీ పర్యటనకు ముందు కజాన్‌లోని భారత కమ్యూనిటీకి చెందినవారు ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న దృశ్యాలు వెలికివచ్చాయి. బ్రిక్స్ గ్రూపులో 2010 నుండి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. తాజాగా ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఎఈ) దీనిలో చేరాయి.
ఇది కూడా చదవండి: పాక్ సుప్రీం సీజే పదవీ కాలం ఇక మూడేళ్లే
Comments
Please login to add a commentAdd a comment