BRICS countries conference
-
బహుళ ధ్రువ ప్రపంచానికి దారి?
అక్టోబర్ 22–24 వరకు కజాన్(రష్యా)లో జరిగిన బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సమావేశం ఒక గొప్ప ఆరంభాన్ని వాగ్దానం చేసింది. బ్రిక్స్ దేశాలుతమ మధ్య ఆర్థిక వ్యవహారాలను తమ స్థానిక కరెన్సీలలో జరుపుకోవాలనీ, తమతో ఆర్థిక సంబంధాలు నెరపే ఇతర దేశాలతో సైతం ఇదే పద్ధతిలో వ్యవహరించేందుకు ప్రయత్నం జరగాలనీ ‘కజాన్ డిక్లరేషన్’ పేర్కొన్నది. ప్రపంచాన్ని శాసిస్తున్న డాలర్ వ్యవస్థను వీలైనంత బలహీన పరచటం వర్ధమాన దేశాలన్నిటికి కీలకంగా మారింది. అధికారం, అభివృద్ధి, విధాన పరమైన నిర్ణయాలకు కొత్త కేంద్రాలు ఉనికిలోకి వచ్చినందున, అవి సమానత్వంతో కూడిన న్యాయబద్ధమైన, బహుళ ధ్రువ ప్రపంచానికి దారులు వేయగలవన్న ఆశాభావం డిక్లరేషన్‌లో కనబడింది.కజాన్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు రెండు రోజుల ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పిన మాటలు సంచలనమయ్యాయి. బ్రిక్స్ దేశాల మధ్య వ్యాపారాలకు, ఇతర అవసరాలకు చెల్లింపులు ఇక మీదటఆ యా దేశాల సొంత కరెన్సీలలోనే ఉండగలవని అన్నారు. అప్పటికి అది ఇంకా బ్రిక్స్ తీసుకున్న తుది నిర్ణయమో,చేసిన ఉమ్మడి ప్రకటనో కాదు. అయితే, ఈ అంశంపై బ్రిక్స్ దేశాల మధ్య కొంతకాలంగాసంప్రదింపులు సాగుతున్నాయి. ఒక ఏకాభిప్రాయ ప్రకటన రాగల సూచనలు కూడా ఉన్నాయి. అందువల్లనే కూటమి దేశాలేవీ పుతిన్ ముందస్తు ప్రకటనకు అభ్యంతరపెట్టలేదు. అక్టోబర్ 23న విడుదలైన కజాన్ డిక్లరేషన్‌లోని 134 పేరాగ్రాఫ్‌ల సుదీర్ఘ సంయుక్త ప్రకటనను చదివినపుడు, అందులో అత్యధికం ఆర్థిక సంబంధమైన అంశాలే కనిపిస్తాయి. వాటిలో రెండు (63, 65) పుతిన్ పేర్కొన్న స్థానిక కరెన్సీ చెల్లింపులకు సంబంధించినవి.134 పేరాలలో రెండు మాత్రమే ఇవా? అందుకోసం ఇంత ఆట్ట హాస ప్రకటన అవసరమా? అనుకుంటే పొరపాటు. మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్న డాలర్ వ్యవస్థను మటుమాయం చేయటం సాధ్యం కాకపోయినా, వీలైనంత బలహీన పరచటం బ్రిక్స్‌తో సహా మొత్తం వర్ధమాన దేశాలన్నిటికి కీలకంగా మారింది. డాలర్ ఆధిపత్యాన్నిఎంత దెబ్బ తీయగలిగితే, ప్రపంచంపై అమెరికా రాజకీయ, సైనిక ప్రాబల్యాన్ని, భౌగోళిక చాణక్యాన్ని అంతగా ఎదుర్కొనగలరు.ఈ దేశాలకు ఇటువంటి అవకాశం లభించటం ప్రపంచ చరిత్ర లోనే ఇది మొదటిసారని చెప్పాలి. వలస పాలనలు 60–70 సంవ త్సరాల క్రితమే ముగిసి ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయసంస్థలు ఎన్ని ఏర్పడినా, ఒకటి రెండు అగ్ర దేశాలే ఏకధ్రువ,ద్విధ్రువ ప్రపంచాలను సాగించాయి. అంతర్జాతీయ చట్టాలను తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ రాగా, అమెరికన్ డాలర్, యూరోపియన్ దేశాల యూరో కరెన్సీలు అందుకు సాధనాలుగా మారాయి.1947 స్వాతంత్య్ర సమయంలో ఒక డాలర్‌కు ఒక రూపా యిగా ఉండిన భారత కరెన్సీ ఈ రోజున 84 రూపాయలకు పడి పోయిందంటే అందుకు ఇవన్నీ కారణాలే. ఆ విలువ సహజ క్రమంలో తగ్గటం ఒకటైతే, అమెరికన్లు, ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ వారు ఒత్తిడి చేసి మరీ విలువను తగ్గింపజేసే సందర్భాలు వర్ధమాన దేశాలకు అనేకం. అంతర్జాతీయంగా ముడిసరకుల అమ్మకాలు, వాణిజ్య నిబంధనలు, డబ్ల్యూటీవో పనితీరు అన్నీ ధనిక దేశాలకు, డాలర్‌కు అనుకూలం. ఈ విధమైన అనేకానేక సమస్యలన్నింటికి సమాధానాలు కజాన్ డిక్లరేషన్‌లో పొందు పరచటం గమనార్హం. ఇటువంటి ఆలోచనలకు, మార్పులకు ఒక గొప్ప ఆరంభం బ్రిక్స్ దేశాలు తమ మధ్య ఆర్థిక వ్యవహారాలు తమ స్థానిక కరెన్సీలలో జరుపుకోవటం. తమతో ఆర్థిక సంబంధాలు నెరపే ఇతర దేశాలతో సైతం ఇదే పద్ధతిలో వ్యవహరించేందుకు ప్రయత్నం జరగాలని కూడా ఆ డిక్లరేషన్ పేర్కొన్నది. ఆ డాక్యుమెంట్ శీర్షికను గమనిస్తేనే బ్రిక్స్ లక్ష్యం, అంతరార్థం, భవిష్యత్తు గురించిన దార్శనికత అర్థమైపోతుంది: న్యాయబద్ధమైన విధంగా ప్రపంచాభివృద్ధి కోసం, భద్రత కోసం బహుళత్వాన్ని శక్తిమంతం చేయటం. ఈ మూడు క్లుప్తమైన మాటలను శోధిస్తూ పోతే అనేక విషయాలు అర్థమవుతాయి. వలసవాదం అంతమై, అంతర్జాతీయ సంస్థలు, నిబంధనలు ఎన్ని ఏర్పడినా పాశ్చాత్య రాజ్యాల ఏకధృవ ఆధిపత్యాన్ని తట్టుకోలేకపోయిన తక్కిన ప్రపంచానికి ఇపుడు బ్రిక్స్ రూపంలో ఒక బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడగల అవకాశాలు చరిత్రలో మునుపెన్నడూ లేనివి. వాస్తవానికి బహుళ ధృవ ప్రపంచ సృష్టి అనే మాట కొంతకాలంగా వినవస్తున్నదే. కాలక్రమంలో ఇండియా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటు కొన్ని ఏషియన్, ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్, అరబ్ దేశాలు కొంత అభివృద్ధి సాధించి మధ్యమస్థాయి దేశాలుగా పురోగమించినా, వాటికి కూడా వివిధ పరిస్థితులవల్ల స్థిరత్వం ఉండటం లేదు. బ్రిక్స్ ఏర్పడినాక ఇంతకు ముందు 15 శిఖరాగ్ర సమావేశాలు జరిగినా, వివిధ ఆర్థికపరమైన నిర్ణయాల మూలంగా కజాన్‌లో జరిగింది ఎంతో భిన్నమైనది!డిక్లరేషన్‌లోని 134 పేరాలను 4 ఉప శీర్షికల కింద విభజించగా, అందులో 3 ఆర్థిక సంబంధమైనవే కావటం గమనించదగ్గది. అవన్నీ ఇక్కడ రాయటం వీలుకాదు గానీ, వాటి సారాంశాన్ని చెప్పుకోవాలంటే ఈ విధంగా ఉంటుంది: గ్లోబల్ సౌత్ అనబడే వర్ధమాన దేశాల కోసం పని చేయటం. అధికారం, అభివృద్ధికి, విధానపరమైన నిర్ణయా లకు కొత్త కేంద్రాలు ఉనికిలోకి వచ్చినందున, అవి సమానత్వంతో కూడిన న్యాయబద్ధమైన, బహుళ ధ్రువ ప్రపంచానికి దారులు వేయ గలవు. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి, డబ్ల్యూటీవో వంటి సంస్థలను సంస్కరించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రత్యేక అవకాశాలివ్వాలి. ముఖ్యంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబి యన్ ప్రాంతాలకు వాణిజ్యంపై ఏకపక్ష నియంత్రణలు, ఆంక్షలుఉండరాదు. అంతర్జాతీయ రుణాల చెల్లింపు పద్ధతిలో మార్పులు రావాలి. బ్రిక్స్ దేశాల మధ్య చెల్లింపులు స్థానిక కరెన్సీలలో జరగాలి. బ్రిక్స్ పే కార్డును వినియోగానికి తేవాలి. అయితే ఈ విషయమై ఇంకా చర్చలు అవసరం. అట్లాగే ఇది స్వచ్ఛందమే తప్ప, తప్పనిసరి కాదు. బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, వనరుల వితరణ; విద్యా, సాంకే తిక, ఆరోగ్య, పారిశ్రామిక రంగాలలో సహకారం పెరగాలి.కజాన్ డిక్లరేషన్ ఈ విధమైన స్వతంత్ర ప్రకటనలు చేస్తూనే, బ్రిక్స్ కూటమి పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకం కాదనీ, తమదొక స్వతంత్రమైన సంస్థ మాత్రమేననీ స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కొద్దికాలం క్రితం, ‘‘వారు (పాశ్చాత్య దేశాలు) ఒక క్లబ్ పెట్టుకున్నారు. మమ్ములను అందులోకి రానివ్వలేదు. కనుక మా క్లబ్బు మేము పెట్టుకున్నా’’మని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. మొదట బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో బ్రిక్‌గా ఏర్పడిన ఈసంస్థ దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్‌గా మారింది. వాటి ఉమ్మడి భూభాగం ప్రపంచంలో 33.9 శాతం, జనాభా 45.2 శాతం, పారిశ్రా మిక ఉత్పత్తి 39.3 శాతం, జీడీపీ 36.7 శాతం, ఎగుమతుల శాతం 24.5 శాతం కావటాన్ని బట్టి ప్రపంచంలో వాటి స్థానం ఎంతటిదో గ్రహించవచ్చు. ఈ అయిదు దేశాలు కాక ఇప్పుడు కొత్తగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ చేరాయి. సౌదీ అరేబియా త్వరలో చేరనుంది. మరొక 30 చేరగోరుతున్నట్లు పుతిన్ ప్రకటించారు. బ్రిక్స్ విస్తరించేకొద్దీ పరిస్థితి గణనీయంగా మారుతుంది. ఈ సంస్థ దేశాల మధ్య ఏకాభిప్రాయంతో పరస్పర సహకారాలు తప్ప ఎవరి అంతర్గత వ్యవహారాలలోనూ జోక్యం చేసుకోవటం ఉండదని స్పష్టం చేయటం విశేషం. ఈ మాట, అటువంటి జోక్యాలు చేసుకునే పాశ్చాత్య దేశాలకు ఒక హెచ్చరిక అని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.అదే సమయంలో కొన్ని రాజకీయ పరిస్థితులను బ్రిక్స్ ఉపేక్షించబోదని కూడా కజాన్ డిక్లరేషన్ వల్ల స్పష్టమవుతున్నది. గాజాపై ఇజ్రాయెల్ మారణకాండను, లెబనాన్‌పై దాడులను ఖండించారు. ఇరాన్‌పై దాడి ఆలోచనను విమర్శించారు. పాలస్తీనా స్వతంత్రతను బలపరిచారు. పశ్చిమాసియాలో అణ్వస్త్ర వ్యాప్తిని వ్యతిరేకించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వివాదాలు ఏర్పడినా చర్చల ద్వారా మాత్రమే పరిష్కారాలు చేసుకోవాలన్నారు. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కజాన్‌లో సమావేశం కానుండగా, సరిహద్దు సమస్యపై ఒక చిన్న ముందడుగు వేయటం ఈ తీర్మానానికి అద్దం పడుతున్నది. మోదీ ముందస్తుగా మాట్లాడుతూ, భారత్–చైనా సత్సంబంధాలు ప్రపంచ శాంతి సుస్థిరతలకు అవసరమన్నారు.- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు- టంకశాల అశోక్ -
మోదీకి ఛక్–ఛక్ లడ్డూ, కొరొవాయ్ కేక్.. రష్యా స్పెషల్!
కజాన్: బ్రిక్ శిఖరాగ్ర సదస్సులో వాడీవేడీ చర్చల కోసం రష్యాలోని కజాన్ నగరంలో ల్యాండయిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఛక్–ఛక్ లడ్డూలు, కొరొవాయ్ కేకులు స్వాగతం పలికాయి. ఈ కొత్తరకం పేర్ల వంటకాలను చూసి నెటిజన్లు ఆన్లైన్లో వీటి ప్రత్యేకత గురించి తెగ వెతికేస్తున్నారు. ప్రధాని మోదీకి రష్యా స్థానిక మైనారిటీలైన టాటర్ మహిళలు తమ సంప్రదాయ వేషధారణ, వంటకాలతో స్వాగతం పలికారు. ఇందులో ప్రధానంగా ఛక్–ఛక్ లడ్డూ, కొరొవాయ్ కేకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వంటకాల్లో రష్యా సంప్రదాయ, చారిత్రక విశిష్టత దాగి ఉంది. కజాన్ నగరం ఉన్న టాటర్, బష్కిర్ ప్రాంతాల ఆహార, ఆతిథ్య సంప్రదాయాలు వీటిలో సమ్మిళితమై ఉన్నాయి. ఏమిటీ ఛక్–ఛక్ లడ్డూ? ఛక్–ఛక్ లడ్డూను ప్రధానంగా గోధుమ పిండితో తయారుచేస్తారు. గోధుమపిండితో చపాతీలు చేసి పెనంపై కాల్చకుండా సన్నగా నిలువుగా, అడ్డంగా చిన్నచిన్న చతురస్రాకారపు గడుల్లా కత్తిరించుకోవాలి. తర్వాత వీటిని నూనెలో బంగారం రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత బెల్లం లేదా చక్కెర పాకం తయారుచేసి అందులో కలుపుకుని గట్టిపడ్డాక లడ్డూలాగా గుండ్రంగా చేసుకోవాలి. అంతే ఛక్–ఛక్ లడ్డూ తయార్. ఛక్–ఛక్ లడ్డూ అంటే ఇక్కడి ప్రాంతవాసులకు ఎంతో ఇష్టం. దీన్ని రుచిచూడటానికి ఇవ్వగానే మోదీ ఒకింత ఆశ్చర్యపోయారు. ఇది భారత్‌లో తయారుచేసే వంటకంలా ఉందని వ్యాఖ్యానించారు. బిహార్ వంటకం ముర్హీ కా లాయ్, పశ్చిమబెంగాల్ వంటకం మురీర్ మోవా, ఒడిశా వంటకం మువాలా ఉందని సరదాగా అన్నారు. ఛక్–ఛక్ లడ్డూ మూలాలు టాటర్స్థాన్, బష్కోర్టోస్థాన్లలో ఉన్నాయని స్థానికులు చెబతున్నారు. టాటర్‌స్థాన్‌లో ఇది జాతీయ మిఠాయిగా ప్రఖ్యాతిగాంచింది. కొరొవాయ్ కథాకమామిషు.. మోదీ రుచిచూసిన మరో తీపి పదార్థం కొరొవాయ్ కేకు. బేకరీ వంటకమైన ఈ కొరొవాయ్ కేకు అక్కడ ప్రతి పెళ్లి వేడుకల్లో తప్పకుండా ఉండాల్సిందే. అతిథులకు వడ్డించడం కోసమే ప్రత్యేకంగా దీనిని సిద్దంచేస్తారు. తూర్పు స్లావిక్ ప్రాంతవాసులు ఈ బ్రెడ్ కేక్‌ను తయారుచేసేవాళ్లు. అదే ఇప్పుడు సంప్రదాయంగా వస్తోంది. స్లావ్ ప్రాంత ప్రజలు సూర్యుడిని పూజించేవాళ్లు. వృత్తాకార సూర్యుడికి గుర్తుగా ఈ కేకును గుండ్రంగానే తయారుచేస్తారు.చదవండి: ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి.. అన్నివిధాలా సహకరిస్తాం: మోదీపెళ్లయిన జంట భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ పెళ్లిలో అందరికీ పంచిపెడతారు. కొన్ని సార్లు కేకు పిండి ముద్దలను పొడవుగా జడపాయల్లా అల్లి తర్వాత గుండ్రంగా చుట్టి బేక్ చేస్తారు. పూర్వం ఈ కేకులో ఉప్పు కాస్తంత ఎక్కువ వేసేవాళ్లు. ఉప్పు అతిథులతో బంధాన్ని మరింత బలపరుస్తుందని వారి నమ్మకం. బ్రిక్ సదస్సులో మాత్రం అతిథులకు దీనికి తోడుగా తేనెను అందిస్తున్నట్లు తెలుస్తోంది. -
బ్రిక్స్ సదస్సు: రష్యాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
కజాన్: బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు (మంగళవారం) రష్యాలోని కజాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి భారీగా తరలి వచ్చిన ప్రజలు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. రష్యా అధ్యక్షతన 16వ బ్రిక్స్ సదస్సును నేడు రేపు(అక్టోబర్ 22, 23) నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు రష్యాలోని కజాన్ నగరం వేదికగా మారింది. ఈ సంద్భంగా ప్రధాని మోదీ బ్రిక్స్ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. దీంతో పాటు పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. #WATCH | Prime Minister Narendra Modi receives a warm welcome as he lands in Kazan, Russia. He is here to attend the 16th BRICS Summit, being held under the Chairmanship of Russia. The Prime Minister is also expected to hold bilateral meetings with his counterparts from BRICS… pic.twitter.com/ATyEIRSXZa— ANI (@ANI) October 22, 2024రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు. ఆతిథ్య రష్యా అధ్యక్షతన 16వ బ్రిక్స్ సదస్సు జరుగుతోంది. 16వ బ్రిక్స్ సదస్సులో ‘సమాన రీతిలో ప్రపంచ అభివృద్ధి’ అనే అంశంపై చర్చ జరగనుంది. కాగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశం కూడా జరగవచ్చని తెలుస్తోంది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ బ్రిక్స్ వ్యవస్థాపక సభ్యులతో పాటు కొత్త సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అక్టోబరు 22న తొలిరోజు సాయంత్రం నేతలకు విందు ఉంటుందన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో 23న క్లోజ్డ్ ప్లీనరీ, ఓపెన్ ప్లీనరీ సెషన్ ఉంటుందని తెలిపారు.ఇది కూడా చదవండి: ఈజీగా విదేశీ భాష, క్రేజీగా కొరియన్ నేర్చుకుందామా! -
బ్రిక్స్ సమ్మిట్: రష్యాకు బయలుదేరిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: రష్యాలో నేడు, రేపు(అక్టోబర్ 22, 23) జరిగే 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలోని కజాన్ నగరానికి తరలివెళ్లారు. రష్యాలో ప్రధాని మోదీ పర్యటన రెండు రోజులపాటు సాగనుంది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. #WATCH | PM Narendra Modi leaves from Delhi for Russia to attend the 16th BRICS Summit, being held in Kazan, under the Chairmanship of Russia.The Prime Minister is also expected to hold bilateral meetings with his counterparts from BRICS member countries(Source - ANI/DD) pic.twitter.com/opQmNl6oPR— ANI (@ANI) October 22, 202416వ బ్రిక్స్ సదస్సు ‘సమాన రీతిలో ప్రపంచ అభివృద్ధి- భద్రత కోసం బహుపాక్షికతను బలోపేతం చేయడం’ అనే అంశంపై జరగనుంది. కాగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ సందర్భంగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ వ్యవస్థాపక సభ్యులతో పాటు కొత్త సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అక్టోబరు 22న సమ్మిట్ ప్రారంభం కానున్నదని, తొలిరోజు సాయంత్రం నేతలకు విందు ఉంటుందన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో 23న ఉదయం క్లోజ్డ్ ప్లీనరీ, మధ్యాహ్నం ఓపెన్ ప్లీనరీ సెషన్ ఉంటుంది.#WATCH | Russia: Visuals from Kazan; billboards put up by Indian diaspora to welcome PM ModiPrime Minister Narendra Modi will visit Russia from 22-23 October 2024 at the invitation of Russian President Vladimir Putin, to attend the 16th BRICS Summit, which is being held in… pic.twitter.com/N5WHOl3Xrq— ANI (@ANI) October 21, 2024బ్రిక్స్ సదస్సుకు ముందు భారత్, చైనాల మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. 2020 నుంచి కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే దిశగా ముందడుగు పడింది. రెండు దేశాల మధ్య సైనిక, దౌత్య స్థాయిలో కసరత్తుల తర్వాత, వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)పై పెట్రోలింగ్, సైనిక ఉద్రిక్తతను తగ్గించడానికి ఒప్పందం కుదిరింది.#WATCH | Russia: Visuals from Kazan, ahead of the BRICS summit 2024Prime Minister Narendra Modi will visit Russia from 22-23 October at the invitation of Russian President Vladimir Putin, to attend the 16th BRICS Summit, which is being held in Kazan, under the Chairmanship of… pic.twitter.com/fCKdFdT87B— ANI (@ANI) October 21, 2024ఇదిలా ఉండగా ప్రధాని మోదీ పర్యటనకు ముందు కజాన్‌లోని భారత కమ్యూనిటీకి చెందినవారు ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న దృశ్యాలు వెలికివచ్చాయి. బ్రిక్స్ గ్రూపులో 2010 నుండి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. తాజాగా ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఎఈ) దీనిలో చేరాయి.ఇది కూడా చదవండి: పాక్ సుప్రీం సీజే పదవీ కాలం ఇక మూడేళ్లే -
మోదీ గొప్ప స్నేహితుడు: పుతిన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు గొప్ప మిత్రుడంటూ పొగిడారు. రష్యాలోని కజాన్‌లో వచ్చే నెలలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్) దేశాల జాతీయ భద్రతాదారుల సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం అజిత్ దోవల్ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. మోదీతో భేటీకి ఆసక్తిగా ఉన్నట్లు ఈ సందర్భంగా పుతిన్ తెలిపారు. దాదాపు మూడు వారాల క్రితం ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో జరిపిన పర్యటన, అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చల వివరాలను దోవల్ ఆయనకు వివరించారు. ‘బ్రిక్స్ శిఖరాగ్రం సమయంలో అక్టోబర్ 22వ తేదీన మోదీతో సమావేశమవ్వాలని, రెండు దేశాల మధ్య విజయవంతంగా అమలవుతున్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం, భద్రతా పరమైన అంశాలపై చర్చించాలని అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదించారు’ అని రష్యా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే నెల 22–24 తేదీల్లో రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ శిఖరాగ్రం జరగనుంది. జూలైలో మోదీ రష్యాలో పర్యటించారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్, బ్రెజిల్, చైనాలకు కీలకంగా ఉన్నాయని ఇటీవల పుతిన్ పేర్కొనడం తెలిసిందే. కాగా, బ్రిక్స్ శిఖరాగ్రానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హాజరవనున్నారు. ఈ విషయాన్ని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ధ్రువీకరించారు. గురువారం ఆయన పుతిన్‌తో సమావేశమయ్యారు. -
ఉగ్రవాదంతో ట్రిలియన్ డాలర్ల నష్టం
బ్రసీలియా: ఉగ్రవాదం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు లక్ష కోట్ల డాలర్ల వరకు నష్టం వాటిల్లిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం కారణంగా నెలకొన్న పరిస్థితులు వాణిజ్య, వ్యాపార రంగాలను పరోక్షంగానైనా, లోతుగా దెబ్బతీశాయన్నారు. 11వ బ్రిక్స్ సదస్సులో భాగంగా జరిగిన ప్లీనరీ సమావేశంలో గురువారం మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరులో బ్రిక్స్ దేశాల సహకారాన్ని మోదీ ప్రశంసించారు. బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలోని ప్రఖ్యాత తమారటి ప్యాలెస్‌లో జరిగిన సమావేశంలో ఇతర సభ్యదేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల అధినేతల సమక్షంలో మోదీ మాట్లాడుతూ.. అభివృద్ధికి, శాంతి, సౌభాగ్యాలకు ఉగ్రవాదం పెను ముప్పుగా పరిణమించిందన్నారు. ‘ఒక అంచనా ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికాభివృద్ధి ఉగ్రవాదం కారణంగా 1.5% తగ్గింది. గత పదేళ్లలో ఉగ్రవాదం కారణంగా 2.25 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు’ అని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, జల నిర్వహణ సవాలుగా మారాయని, బ్రిక్స్ దేశాల తొలి జలవనరుల మంత్రుల సమావేశాన్ని భారత్‌లో నిర్వహించాలని అనుకుంటున్నామని మోదీ తెలిపారు. ‘ఇటీవలే భారత్‌లో ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాం. ఫిట్నెస్, ఆరోగ్యం విషయాల్లో సభ్య దేశాల సంప్రదింపులు మరింత పెరగాలని కోరుకుంటున్నా’ అన్నారు. ‘ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ దేశాల మధ్య జరిగే వాణిజ్యం వాటా కేవలం 15 శాతమే. కానీ ఈ ఐదు దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో 40% పైగా ఉంది. అందువల్ల వాణిజ్యం, పెట్టుబడుల్లో ద్వైపాక్షిక సహకారంపై బ్రిక్స్ దేశాలు దృష్టి పెట్టాల్సి ఉంది. వచ్చే 10 సంవత్సరాల్లో బ్రిక్స్ దిశ ఎలా ఉండాలో చర్చించాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ఈ సదస్సుకు ‘సృజనాత్మక భవితకు ఆర్థికాభివృద్ధి’ అనే థీమ్ సరైనదని మోదీ అభిప్రాయపడ్డారు. గణతంత్రానికి బ్రెజిల్ అధ్యక్షుడు 2020లో భారత గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిధిగా బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బొల్సొనారొ పాల్గొననున్నారు. ఈ మేరకు మోదీ ఆహ్వానానికి ఆయన సంతోషంగా ఆమోదం తెలిపారు. బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారొతో బుధవారం మోదీ సమావేశమయ్యారు. ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి చర్చలు జరిగాయి. జిన్‌పింగ్, పుతిన్‌లతో చర్చలు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో మోదీ విడిగా మాట్లాడారు. రష్యాలో వచ్చే సంవత్సరం మేలో జరిగే ‘విక్టరీ డే’వేడుకలకు మోదీని పుతిన్ ఆహ్వానించారు. రైల్వేలో ద్వైపాక్షిక సహకారంపై, ముఖ్యంగా నాగపూర్, సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల వేగాన్ని పెంచడంపై సమీక్ష జరిపారు. -
నేడు చైనాకు ప్రధాని
-
నేడు చైనాకు ప్రధాని
బ్రిక్స్ సదస్సుకు హాజరుకానున్న నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: చైనాలో జరగనున్న బ్రిక్స్ దేశాల సదస్సు నుంచి ఫలవంతమైన చర్చలు, సానుకూల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సు కోసం నేడు చైనాకు బయల్దేరి వెళ్లనున్న సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘గోవా బ్రిక్స్ సదస్సు ద్వారా సాధించిన ఫలితాలు తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాను. శాంతి, భద్రత, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంలో బ్రిక్స్ కూటమి ముఖ్య భూమిక పోషించింది’ అని ప్రధాని అన్నారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్య దేశాలుగా ఉన్న బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్ 3 నుంచి 5 వరకూ చైనాలోని గ్జియామెన్ నగరంలో జరగనుంది. బ్రిక్స్ సదస్సు వేదికగా దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతామని వెల్లడించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అధ్యక్షతన సెప్టెంబర్ 5న జరిగే ‘ఎమర్జింగ్ మార్కెట్స్, అండ్ డెవలపింగ్ కంట్రీస్’ సదస్సులో పాల్గొనడంతో పాటు, బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్‌తో కూడా భేటీ అవుతామని ప్రకటనలో పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సు వేదికగా జిన్‌పింగ్ ప్రధాని ప్రత్యేక చర్చలు జరపవచ్చని భావిస్తున్నారు. మయన్మార్ పర్యటన గురించి స్పందిస్తూ.. భద్రత, ఉగ్రవాద పోరు, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక వసతులు, ఇంధనం, సంస్కృతి రంగాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న సహకారం బలోపేతం కోసం ఇరు దేశాలు ఆసక్తిగా ఉన్నాయని మోదీ అన్నారు. మయన్మార్‌లో సెప్టెంబర్ 5 నుంచి 7 వరకూ మోదీ పర్యటిస్తారు.