సినిమా అంశాలు, గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ జాన్వీ కపూర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసిన జాన్వీ కపూర్, తడక్‌తో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తొలి ప్రయత్నంలోనే నటిగా ప్రశంసలు అందుకుంది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు ఆశించినంత సక్సెస్ కాలేదు.
తమిళంలో నయనతార నటించిన హీరోయిన్ కోలవవు కోకిల చిత్రాన్ని జాన్వీ కపూర్ హిందీలో రీమేక్ చేశారు. గుడ్ లక్ జెర్రీ పేరుతో రపొందిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదలైనా, థియేటర్లలో విడుదల కాలేదన్న బాధ ఈ అమ్మడికి ఉందట.
ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో తల్లి శ్రీదేవి చేసిన సినిమాలను రీమేక్ చేస్తారా అని ప్రశ్నించగా అంతటి సాహసం చేయలేనని పేర్కొంది. తన తల్లి ప్రతి సినిమాలో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుందని తెలిపింది. ఇక దక్షిణాది సినిమాల్లో నటించడానికి తాను వెయిటింగ్ అని, మంచి ఆఫర్స్ వస్తే అసలు వదులకోనను చెప్పింది. చదవండి: విజయ్ దేవరకొండపై శ్రీదేవి కూతురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment