Irudhi Suttru
-
లేడీ డైరెక్టర్ సినిమాకి యస్
హీరో సూర్య టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నారు. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్‌ను మస్త్ ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సెల్వ రాఘవన్, కేవీ ఆనంద్ దర్శకత్వంలో హీరోగా సినిమాలు చేస్తోన్న సూర్య తర్వాతి చిత్రం ‘ఇరుది సుట్రు’ ఫేమ్ సుధా కొంగర డైరెక్షన్లో రూపొందనుందని కోలీవుడ్ సమాచారం. తొలిసారి ఓ లేడీ డైరెక్టర్‌తో సూర్య చేయనున్న చిత్రం ఇది. ‘ఇరుది సుట్రు’ తెలుగు రీమేక్ ‘గురు’ చిత్రం కూడా సుధా కొంగర దర్శకత్వంలోనే తెరకెక్కిన సంగతి తెలిసిందే. ‘మెర్సెల్, వేలైక్కారన్, సర్కార్’ చిత్రాలకు పాటలు రాసిన వివేక్ ఈ సినిమాకు కూడా లిరిక్స్ రాయనున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందించనున్నారు. ‘‘సూర్య సార్‌తో తొలిసారి వర్క్ చేయడం ఆనందంగా ఉంది. జీవీ ప్రకాశ్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. సుధా మేడమ్‌కి థ్యాంక్స్’’ అన్నారు వివేక్. -
'ఆస్కార్ గెలిచినంత ఆనందంగా ఉంది'
చెన్నై: కిక్ బాక్సర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి సినీనటిగాను నిరూపించుకుంది రితికా సింగ్. తమిళ చిత్రం 'ఇరుధి సుత్రు' (హిందీలో 'సాలా ఖద్దూస్') లో నిజజీవిత పాత్రను అద్భుతంగా పోషించిన రితికా సింగ్‌కు స్పెషల్ మెన్షన్ కేటగిరీ కింద జాతీయ అవార్డు లభించింది. 'నిజంగా నాకు నోట మాట రావడం లేదు. ఆస్కార్ అవార్డు గెలిచినంత ఆనందంగా ఉంది. ఇంతటి గౌరవాన్ని అందించినందుకు 'ఇరుథి సుత్రు' చిత్రయూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు చెప్తున్నా. తొలి సినిమాకు ఇలాంటి అవార్డు రావడం అంటే ఎంతో గొప్ప విషయం. మరింత ఉత్తమంగా పనిచేసేందుకు దీనిని ప్రోత్సాహంగా స్వీకరిస్తాను' అని రితికా సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. చేపలు పట్టుకునే ఓ యువతి.. మాజీ కిక్ బాక్సింగ్ చాంపియన్ ఆధ్వర్యంలో శిక్షణ పొంది.. అత్యుత్తమ క్రీడాకారిణిగా నిలిచే కథతో 'ఇరుథి సుత్రు' చిత్రం తెరకెక్కింది. ఇందులో రితిక చేపలు పట్టే అమ్మాయిగా మంచి అభినయాన్ని కనబర్చగా, మాజీ కిక్ బాక్సింగ్ చాంపియన్‌గా, కోచ్‌గా మాధవన్ నటించాడు. మన తెలుగు వ్యక్తి అయిన సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇది 'తను వెడ్స్ మను రిటర్న్స్' చిత్రంలో ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్న తనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం దక్కడంపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సంతోషం వ్యక్తం చేసింది. ఇది తనకు బెస్ట్ బర్త్ డే గిఫ్ట్లాంటిందని ఆమె పేర్కొంది. మంగళవారం కంగనా 29వ పుట్టినరోజు జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో తనకు జాతీయ పురస్కారం దక్కడం ఎంతో థ్రిల్ కలిగిస్తున్నదని ఓ ప్రకటనలో తెలిపింది. అమితాబ్ బచ్చన్ ఉత్తమ నటుడిగా, తాను ఉత్తమ నటిగా ఒకేసారి పురస్కారాలు అందుకోవడం ఎంతో ఎక్సైటింగ్‌గా ఉందని పేర్కొంది. కంగనాకు ఇది మూడో జాతీయ చలనచిత్ర పురస్కారం. 'ఫ్యాషన్' సినిమాకు ఉత్తమ సహాయ నటిగా, 'క్వీన్' సినిమాకు ఉత్తమ నటిగా, ప్రస్తుతం 'తను వెడ్స్ మను రిటర్న్స్'కు మరోసారి ఉత్తమ నటిగా పురస్కారాలు అందుకుంది. -
ఆ సినిమాను ప్రశంసించిన శంకర్
చెన్నై: మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ సినిమా సాలా ఖదూస్ పై ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ సినిమా తమిళ వెర్షన్ 'ఇరుది సుట్రు' ను ప్రముఖ దర్శకుడు శంకర్ కొనియాడారు. ఈ సినిమా దర్శకురాలు, నటీనటులు, సంగీత దర్శకుడి పై తన అధికారిక ట్విట్టర్ లో ప్రశంసల జల్లు కురిపించారు. *మహిళలకు ఒక వందనం ' డైరెక్టర్ సుధ ప్రయత్నం చాలా బావుంది అంటూ ట్విట్ చేశారు. మాధవన్, రితికీ నటన అద్భుతంగా ఉందని, సంతోష్ అందించిన సంగీతం చాలా బావుందంటూ తన సంతోషాన్ని ప్రకటించారు. కాగా చెన్నైలోని మురికివాడల నుంచి మట్టిలోని ఓ మాణిక్యాన్ని వెలికితీసి, బాక్సింగ్ చాంపియన్‌గా తీర్చిదిద్దిన బాక్సింగ్ కోచ్ జీవితం చుట్టూ నడిచే సినిమా ఇరుది సుట్రు. తెలుగుదర్శకురాలు సుధ కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికై పలు సంచలనాలను నమోదు చేసింది. ఈ సినిమాకోసం భారీగా బరువు తగ్గి హీరో మాధవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు, రియల్ లైఫ్ బాక్సర్ అయిన రితికా సింగ్ మహిళా బాక్సర్ పాత్ర పోషించారు. అటు ఈ సినిమాను తాను చూడాలనుకుంటున్నానంటూ బాక్సింగ్ యోధుడు కూడా మైక్ టైసన్ సోషల్ మీడియాలో ఆసక్తిని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. "Irudhi suttru" - 'A salute to women'. Great effort by the director Sudha. Superb performance by Rithika n Maddy. Good music by Santhosh. — Shankar Shanmugham (@shankarshanmugh) February 6, 2016