రతన్‌ టాటా బయోపిక్‌..‌ అది నేను కాదు.. | Madhavan Clears Rumours That He will Plays Ratan Tata Biopic | Sakshi
Sakshi News home page

రతన్‌ టాటా బయోపిక్‌..‌ అది నేను కాదు..

Published Sat, Dec 12 2020 12:40 PM | Last Updated on Sat, Dec 12 2020 6:49 PM

Madhavan Clears Rumours That He will Plays Ratan Tata Biopic - Sakshi

పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా పేరుతో రానున్న బయోపిక్‌లో తను నటించడం లేదని హీరో మాధవన్‌ స్పష్టం చేశారు. రతన్‌ టాటా జీవిత కథ నేపథ్యంలో త్వరలో ఓ బయోపిక్‌ తెరకెక్కనుందని, ఇందులో ఒకప్పటి లవర్‌ బాయ్‌ మాధవన్‌ నటిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు స్పందించిన ఓ పోస్టు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఈ వార్తపై తాజాగా మాధవన్‌ స్పందిస్తూ శనివారం ఓ ట్వీట్‌ చేశారు. ‘హే దురదృష్టవశాత్తు ఇది నిజం కాదు. కొంతమంది అభిమానుల తమ కోరిక మేరకు ఈ పోస్ట్‌ను సృష్టించి వైరల్‌ చేస్తున్నట్టున్నారు. అంతే తప్పా ఇందులో ఏమాత్రం నిజం లేదు. దీనికి సంబంధించి ఏ ప్రాజెక్ట్‌ ఇంతవరకు నా దగ్గరికి రాలేదు.. కనీసం చర్చ కూడా జరగలేదు’ అంటూ మాధవన్‌ ట్వీట్‌ చేశారు. (చదవండి: మాధవన్‌ టెన్త్‌ మార్కులు తెలుసా!)

అయితే దర్శకురాలు సుధ కొంగర పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా జీవిత కథ ఆధారం ఓ బయోపిక్‌ను రూపొందిస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆమె పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆమె రతన్‌ టాటా బయోపిక్‌ను లైకా ప్రోడక్షన్‌లో నిర్మిస్తున్నారని, ఈ చిత్రంలో 2021లో షూటింగ్‌ను కూడా జరుపుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మాధవన్‌ ఫొటో ఉన్న ఓ పోస్టర్‌పై రతన్‌ టాటా అని రాసి ఉన్న ఓ పోస్ట్‌  నెట్టింటా హల్‌చల్‌ చేస్తోంది. కాగా ఇటీవల మాధవన్‌, స్వీటీ అనుష్కలు జంటగా నటించిన ‘నిశ్శబ్ధం’ మూవీ ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క మాటలు రాని, వినికిడి లోపం ఉన్న కళాకారిణిగా నటించారు. (చదవండి: ఆ విషాదంపై రతన్‌ టాటా భావోద్వేగం​)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement