మాధవన్‌కు మదురై కోర్టు నోటీసులు
తమిళసినిమా: స్థల ఆక్రమణ కేసులో నటుడు మాధవన్‌కు చెన్నై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాలు.. దిండుగల్ జిల్లా పళనీ సమీపంలోని పాలసముద్రం ప్రాంతానికి చెందిన గణేశ్ హైకోర్టు మధురై శాఖలో ఓ పిటీషన్ దాఖలు చేశారు. అందులో మధురై జిల్లా పాలసముద్రంలో సాగుబడి కాలువ పక్కన ఉన్న రాజమ్మాళ్‌కు చెందిన 4.88 ఎకరాల భూమిని నటుడు మాదవన్ కోనుగోలు చేశారని పేర్కొన్నారు. అయితే ఆయన సాగుబడి కాలువాను కొంత భాగం ఆక్రమించి కొబ్బరి, జామ తోటలను నాటుతున్నారని ఆరోపించారు.
ఆయన ఆక్రమించుకున్న ప్రాంతంలో విద్యుత్ స్తంభం కూడా ఉందన్నారు. దీని గురించి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై విచారించిన విద్యుత్ శాఖ అధికారి ఆ సాగుబడి కాలువ ఉపయోగంలో లేదని తెల్చి చెప్పారన్నారు. కాగా నటుడు మాధవన్ అనుచరులు తనపై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించాడు. దీని గురించి నెయ్‌క్కారపట్టి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నాడు.
వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ గ్రామ ప్రజల జీవనాధారాన్ని కాపాడే విధంగా కాలువ దురాక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆధికారులకు ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు కేకే.చంద్రన్, పీ.గోకుల్‌నాథ్‌లు నటుడు మాధవన్, దిండుగళ్ కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారి, పళనీ తహశీల్దార్‌లకునోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేశారు.