సాలా ఖద్దూస్ రీమేక్లో వెంకీ | Venkatesh To Remake Madhavan starer saala khadoos | Sakshi
Sakshi News home page

సాలా ఖద్దూస్ రీమేక్లో వెంకీ

Published Thu, Jan 28 2016 9:30 AM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

సాలా ఖద్దూస్ రీమేక్లో వెంకీ

సాలా ఖద్దూస్ రీమేక్లో వెంకీ

టాలీవుడ్లో వరుస రీమేక్లతో సూపర్ హిట్లు కొడుతున్న స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. వెంకటేష్ కెరీర్లో స్ట్రయిట్ సినిమాలుగా చేసిన వాటికన్నా రీమేక్ సినిమాలే ఎక్కువగా సక్సెస్ సాధించాయి. ముఖ్యంగా తన బాడీలాంగ్వేజ్కు, ఇమేజ్కు తగ్గ కథలు ఏ భాషల్లో వచ్చినా వదిలిపెట్టని వెంకీ, ఇప్పుడు మరో రీమేక్ మీద కన్నేశాడు. ఇప్పటి వరకు సక్సెస్ సాధించిన సినిమాలే, రీమేక్ చేసే ఈ సీనియర్ స్టార్, ఈ సారి మాత్రం ఇంకా రిలీజ్ కూడా కానీ సినిమా మీద దృష్టి పెట్టాడు.

సౌత్ నార్త్ ఇండస్ట్రీలో మంచి  ఫాలోయింగ్ ఉన్న మాధవన్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా సాలాఖద్దూస్. సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ చూసిన వెంకీ, తెలుగులో రీమేక్ చేయడానికి ఓకె చెప్పాడట. అంతేకాదు దర్శక నిర్మాతలు ఓకె అంటే ఈ ఏడాదిలో ఆ సినిమాలో నటించడానికి రెడీ అన్నాడట.

తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాలో మాధవన్ ఓ రిటైర్ట్ బాక్సర్గా కనిపిస్తున్నాడు. మంచి బాక్సర్ను వెతికి పట్టుకొని, తనను ఛాంపియన్గా తయారు చేయటమే సినిమా కథ. మంచి కథా కథనాలతో పాటు సినిమాటిక్ డ్రామా కూడా కావాల్సినంత ఉండటంతో ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు యూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement