saala khadoos
-
బాక్సర్ వెంకీ!
వెంకటేశ్ కామెడీ చేసినా బాగుంటుంది.. సీరియస్‌గా కనిపించినా సూట్ అవుతుంది. రొమాన్స్, సెంటిమెంట్.. ఇలా అన్నీ చేయగలరు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులకీ దగ్గరయ్యారు వెంకీ. ప్రస్తుతం చేస్తున్న ‘బాబు బంగారం’లో ఎంటర్టైన్మెంట్ పాళ్లు ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈ చిత్రం తర్వాత చేయనున్న దాంట్లో మాత్రం వెంకీ సీరియస్‌గా కనిపించనున్నారు. ఇందులో బాక్సర్ పాత్ర చేయనున్నారు. ‘ఇరుది సుట్రు’, ‘సాలా ఖడూస్’ పేరుతో తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన సినిమా తెలుగు రీమేక్‌లో వెంకటేశ్ నటించనున్నారు. ఒరిజినల్ మూవీలో మాధవన్ చేసిన బాక్సర్ క్యారెక్టర్‌ను ఆయన పోషించనున్నారు. తమిళ చిత్రాన్ని నిర్మించిన వైనాట్ స్టూడియోస్ తెలుగులోనూ నిర్మించనుంది. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేశ్ బాబు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తారు. కథానాయకుడు ఎంతో టాలెంట్ ఉన్నా.. బాక్సింగ్ అసోసియేషన్‌లో ఉన్న రాజకీయాలతో ఛాంపియన్ కాలేకపోతాడు. బాక్సింగ్ కోచ్ గా మారి మట్టిలో మాణిక్యాల్లాంటి బాక్సర్లను వెలికితీయాలని ప్రయత్నాలు చేస్తాడు. రోడ్డు పక్కన చిన్న షాపు నడుపుకునే మది అనే అమ్మాయికి కోచింగ్ ఇచ్చి చాంపియన్‌ను చేస్తాడు. ఇలా సాగే ‘సాలా ఖడూస్’ కథకు తెలుగు నేటివిటీ జోడించి, మన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది దర్శకురాలు సుధా కొంగర ఆలోచన. బాక్సర్ క్యారెక్టర్ కోసం వెంకీ బాడీ ఫిట్నెస్ ఇంకాస్త పెంచుతున్నారట. వెంకీ సిక్స్ ప్యాక్‌లో కనిపిస్తారని ప్రచారం జరిగింది. ఈ విషయం గురించి సురేశ్‌బాబు స్పందిస్తూ - ‘‘ఈ పాత్రకు సిక్స్‌ప్యాక్‌లో కనిపించాల్సిన అవసరం లేదు. బాక్సర్‌గా ఫిట్‌గా కనిపిస్తే చాలు’’ అన్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం విశాఖలో చేస్తార ని సమాచారం. సెప్టెంబర్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మాతృకలో నటించిన రితికా సింగ్... తెలుగు రీమేక్‌లోనూ కనిపించనుంది. -
బాలీవుడ్ సినిమాపై మనసు పడ్డ టైసన్
ముంబై: బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న సాలా ఖదూస్ సినిమాను తాను చూడాలనుకుంటున్నానని బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ తెలిపాడు. 'నేను బాక్సింగ్ సినిమా చూడాలని అనుకుంటున్నా' అంటూ టైసన్ తన అఫీషియల్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. బాక్సింగ్ కోచ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా చూడ్డానికి తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ట్విట్ చేశాడు. దీంతో ఇప్పటికే పలువురి ప్రశంసలందుకుంటున్న మూవీకి భారీగా క్రేజ్ క్రియేట్ అయింది. మైక్ టైసన్ 20 యేళ్ల అతిచిన్న వయసులోనే ప్రపంచ బాక్సింగ్ రంగంలో అనేక టైటిల్స్ ను అందుకుని బాక్సింగ్ లెజెండ్ గా ఖ్యాతి గడించాడు. ఇపుడు ఈ బాక్సింగ్ యోధుడు ఓ ఇండియన్ సినిమా చూస్తానని చెప్పడం ఆసక్తి కరంగా మారింది. అటు ఇప్పుడు అత్యుత్తమ బాక్సర్ నుంచి కూడా ఇలాంటి కామెంట్ రావడంతో.. దర్శకురాలు సుధ కొంగర ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ఈ మూవీలో కోచ్ క్యారెక్టర్ గా టైసన్ ని స్ఫూర్తిగా తీసుకునే డిజైన్ చేసినట్లు గతంలో చెప్పారు. 'నేను కోచ్ మాటలు విన్నరోజున ఖచ్చితంగా గెలుస్తాను. పెడచెవిన పెట్టిన రోజు ఓడిపోయాను.' అని మైక్ టైసన్ మాటలు తనకు స్ఫూర్తి అని తన మూవీ కూడా ఇదే థీమ్ తో ఉందని తెలిపారు. కాగా మాధవన్, రితికా సింగ్ ల అద్భుతమైన నటన, సినిమా కథాకథనాల బలంతో ఇప్పటికే చాలా సంచలనాలకు వేదికైన ఈ మూవీ మరెన్ని రికార్డులు క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే. -
బాలీవుడ్ సినిమాపై మనసు పడ్డ టైసన్
ముంబై: బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న సాలా ఖదూస్ సినిమాను తాను చూడాలనుకుంటున్నానని బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ తెలిపాడు. 'నేను బాక్సింగ్ సినిమా చూడాలని అనుకుంటున్నా' అంటూ టైసన్ తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజ్ లో పేర్కొన్నాడు. ఇప్పటికే రెండు అంతర్జాతీయ సినిమాల్లో నటించిన టైసన్ సోషల్ మీడియాలో తన కోరికను అభిమానులతో పంచుకున్నాడు. బాక్సింగ్ కోచ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా చూడ్డానికి తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నాడు. దీంతో ఇప్పటికే పలువురి ప్రశంసలందుకుంటున్న మూవీకి భారీగా క్రేజ్ క్రియేట్ అయింది. 20 యేళ్ల అతిచిన్న వయసులోనే ప్రపంచ బాక్సింగ్ రంగంలో అనేక టైటిల్స్ ను అందుకుని బాక్సింగ్ లెజెండ్ గా ఖ్యాతి గడించాడు. ఇపుడు ఈ బాక్సింగ్ యోధుడు ఓ ఇండియన్ సినిమా చూస్తానని చెప్పడం ఆసక్తి కరంగా మారింది. అటు ఇప్పుడు అత్యుత్తమ బాక్సర్ నుంచి కూడా ఇలాంటి కామెంట్ రావడంతో.. దర్శకురాలు సుధ కొంగర ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ఈ మూవీలో కోచ్ కేరక్టర్ ని టైసన్ ని స్ఫూర్తిగా తీసుకునే డిజైన్ చేసినట్లు గతంలో చెప్పారు. 'నేను కోచ్ మాటలు విన్నరోజున ఖచ్చితంగా గెలుస్తాను పెడచెవిన పెట్టిన రోజు ఓడిపోయాను.' అని మైక్ టైసన్ మాటలు తనకు స్ఫూర్తి అని తనమూవీ కూడా ఇదే థీమ్ తో ఉంటుందని తెలిపారు. కాగా మాధవన్. రితికా సింగ్ ల అద్భుతమైన నటన, సినిమా కథాకథనాల బలంతో ఇప్పటికే చాలా సంచలనాలకు వేదికైన ఈ మూవీ మరెన్ని బోలెడు రికార్డులు క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే. -
సాలా ఖద్దూస్ రీమేక్‌లో వెంకీ
టాలీవుడ్లో వరుస రీమేక్‌లతో సూపర్ హిట్లు కొడుతున్న స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. వెంకటేష్ కెరీర్లో స్ట్రయిట్ సినిమాలుగా చేసిన వాటికన్నా రీమేక్ సినిమాలే ఎక్కువగా సక్సెస్ సాధించాయి. ముఖ్యంగా తన బాడీలాంగ్వేజ్‌కు, ఇమేజ్‌కు తగ్గ కథలు ఏ భాషల్లో వచ్చినా వదిలిపెట్టని వెంకీ, ఇప్పుడు మరో రీమేక్ మీద కన్నేశాడు. ఇప్పటి వరకు సక్సెస్ సాధించిన సినిమాలే, రీమేక్ చేసే ఈ సీనియర్ స్టార్, ఈ సారి మాత్రం ఇంకా రిలీజ్ కూడా కానీ సినిమా మీద దృష్టి పెట్టాడు. సౌత్ నార్త్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న మాధవన్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా సాలాఖద్దూస్. సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ చూసిన వెంకీ, తెలుగులో రీమేక్ చేయడానికి ఓకె చెప్పాడట. అంతేకాదు దర్శక నిర్మాతలు ఓకె అంటే ఈ ఏడాదిలో ఆ సినిమాలో నటించడానికి రెడీ అన్నాడట. తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాలో మాధవన్ ఓ రిటైర్ట్ బాక్సర్‌గా కనిపిస్తున్నాడు. మంచి బాక్సర్‌ను వెతికి పట్టుకొని, తనను ఛాంపియన్‌గా తయారు చేయటమే సినిమా కథ. మంచి కథా కథనాలతో పాటు సినిమాటిక్ డ్రామా కూడా కావాల్సినంత ఉండటంతో ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు యూనిట్. -
'సాలా ఖద్దూస్' ట్రైలర్ లాంచ్
-
'సాలా ఖద్దూస్' ట్రైలర్ లాంచ్
బాలీవుడ్ స్క్రీన్ మీద తెరకెక్కుతున్న మరో రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామా సాలా ఖద్దూస్. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న మాధవన్ బాక్సింగ్ కోచ్‌గా రఫ్ లుక్‌లో కనిపిస్తున్న ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ నిర్మాణంలో తమిళ్, హిందీ భాషల్లో ఒకే సారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం మాధవన్ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకోవటంతో పాటు బాక్సర్ లుక్‌లో కనిపించేందుకు భారీగా కండలు పెంచాడు. ఇప్పటికే ఇండియన్ స్క్రీన్ మీద రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామాలుగా తెరకెక్కిన మేరీ కోమ్, భాగ్ మిల్కా భాగ్, పాన్ సింగ్ తోమర్ సినిమాలు మంచి విజయాలు సాధించటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో ఎన్నడు కనిపించనంత న్యూ లుక్‌లో మాధవన్ కనిపిస్తున్న ఈ సినిమాలో రితికా సింగ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత మెజీషియన్ పీసీ సర్కార్ కూతురు ముంతాజ్ ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సాలా ఖద్దూస్ సినిమాను జనవరి చివరి వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మంగళవారం జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చిత్రయూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.