Madhavan to play lead role in GD Naidu's Miracle Man biopic - Sakshi
Sakshi News home page

Madhavan: మరో శాస్త్రవేత్త బయోపిక్‌లో మాధవన్‌ 

Published Sat, Apr 8 2023 7:12 AM | Last Updated on Sat, Apr 8 2023 8:23 AM

Madhavan to Play As Scientist GD Naidu in Miracle Man Biopic - Sakshi

తమిళసినిమా: వైవిధ్య భరిత కథా పాత్రపై ఆసక్తి చూపే నటుడు మాధవన్‌. మొదట్లో లవర్‌బాయ్‌గా అలరించిన ఈయన ఆ తరువాత నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనూ తన సత్తా చాటుకుంటున్నారు. అలా ఇటీవలే ప్రఖ్యాత ఇస్రో శాస్త్రవేత్త నంబినారాయణన్‌ జీవిత చరిత్రను రాకెట్రీ నంబి ఎఫెక్ట్‌ పేరుతో స్వీయ దర్శకత్వంలో నిర్మించి టైటిల్‌ పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

తాజాగా మరో తమిళ ప్రముఖ శాస్త్రవేత్త జీడీ నాయుడు బయోపిక్‌లో నటించడానికి సిద్ధం అవుతున్నారన్నారు. ఈ చిత్రాన్ని మీడియా ఒన్‌ గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. అందులోభాగంగా జీడీ నాయుడు పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సేవా సంఘాలతో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా నటుడు మాధవన్‌ ప్రస్తుతం యారడీ నీ మోహిని, తిరుచిట్రంఫలం చిత్రాల ఫేమ్‌ మిత్రన్‌ ఆర్‌. జవహర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ఆయన జీడీ నాయుడు బయోపిక్‌లో నటించడానికి సిద్ధమవుతారని సమాచారం.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement