
భాగమతి సినిమా తరువాత అనుష్క వెండితెరపై కనిపించలేదు. చాలా గ్యాప్ తీసుకున్న స్వీటీ.. ‘నిశ్శబ్దం’ అనే బహుభాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటున్న నిశ్శబ్దం మూవీ నుంచి అనుష్క ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు.
ఈ మేరకు నిర్మాతలు ముహుర్తాన్ని ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 11న ఉదయం 11.11నిమిషాలకు అనుష్క ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీలో అనుష్క మూగ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మాధవన్, అంజలి, షాలినీ పాండే నటిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.
Unveiling #AnushkaShetty's first look from @nishabdham on Sept 11th at 11:11 am! Get ready to meet her!! #NishabdhamFLOnSept11th pic.twitter.com/eZtRr1Gbx0
— Nishabdham Movie (@nishabdham) September 5, 2019
Comments
Please login to add a commentAdd a comment