‘నిశబ్ధం’ మొదలైంది! | Anushka Shetty Nishabdam Starts Rolling | Sakshi
Sakshi News home page

‘నిశబ్ధం’ మొదలైంది!

Published Sat, May 25 2019 1:11 PM | Last Updated on Sat, May 25 2019 1:11 PM

Anushka Shetty Nishabdam Starts Rolling - Sakshi

భాగమతి సినిమా తరువాత వెండితెర మీద కనిపించని అనుష్క, కొత్త సినిమాను ప్రారంభించారు. లుక్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ఈ బ్యూటీ కొత్త సినిమాలో తన కొత్త లుక్‌లో షాక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తెలుగులో ‘నిశబ్ధం’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఇతర భాషల్లో ‘సైలెన్స్‌’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బహుభాషా నటుడు మాధవన్‌ ప్రధాన పాత్రలో నటిస్తుండగా మరో కీలక పాత్రలో హాలీవుడ్ నటుడు  మైఖేల్‌ మ్యాడ్‌సన్‌ కనిపించనున్నారు. ఈ సినిమాకు ‘వస్తాడు నా రాజు’ ఫేమ్‌ హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు. కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement