కుప్పం-కృష్ణగిరి జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున లారీ బోల్తాపడి ఇద్దరు మృతిచెందారు.
చిత్తూరు జిల్లా కుప్పం-కృష్ణగిరి జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున లారీ బోల్తాపడి ఇద్దరు మృతిచెందారు. ఛత్తీస్‌ఘడ్ నుంచి ఇనుప రేకుల లోడుతో కొచ్చిన్ వెళుతున్న లారీ కుప్పం రూరల్ మండలం నడుమూరు వద్ద మలుపులో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో తమిళనాడు నామక్కల్ జిల్లాకు చెందిన డ్రైవర్ దేవరాజు(35), క్లీనర్ మాధవన్(45) అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదహైలను పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఆస్పత్రికి తరలించారు.