Devaraja
-
స్వచ్ఛతకు ‘దివ్యో’పాయం
సాక్షి, ఆదిలాబాద్: వంద శాతం స్వచ్ఛ ఆదిలాబాద్ సాధించేందుకు జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ వినూత్న ఆలోచన చేశారు. మండలాల్లో అధికారులకు రెండు గ్రామాల చొప్పున కేటాయించి లక్ష్యం పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. మండల అధికారు లు, వివిధ శాఖల్లోని ఇంజినీరింగ్ సిబ్బందికి ఈ లక్ష్యాన్ని కేటాయించి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. లక్కీ డ్రా ద్వారా గ్రామాలను అప్పగించారు. లక్ష్యం లో ఫిబ్రవరిలో 50 శాతం, మార్చిలో 50 శాతం లో పూర్తి చేసేలా ఆలోచన చేసి ముందుకు కదులుతున్నారు. ఆమె అనుకు న్న విధంగా మార్చి లో పూర్తి స్థాయిలో కాకపోయినా ప్రభుత్వ లక్ష్యం మేరకు గడువు కంటే ముందే స్వచ్ఛ ఆదిలాబాద్ సాకారమయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండో దశలో 165 జీపీల్లో స్పెషల్‌డ్రైవ్.. రాష్ట్ర స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ)ఆధ్వర్యం లో అన్ని జిల్లాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. గతంలో గ్రామీణ నీటి సరఫరా, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథ కం ఆధ్వర్యంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మా ణాలు చేపట్టారు. ఆ తర్వాత గతేడాది జూన్ నుంచి ఆర్డబ్ల్యూఎస్, ఉపాధిహామీల నుంచి ఐహెచ్హెచ్ఎల్ను నిలిపివేసి పూర్తిగా డీఆర్డీఓలోని ఎస్‌బీఎంకు బదలాయించారు. జిల్లాలో మొదటి దశలో 78 గ్రామపంచాయతీల్లో వ్యక్తిగ త మరుగుదొడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ గ్రామపంచాయతీల్లో 20వేలకు పై గా లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు 11వేలకు పై గా పూర్తిచేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 9వేలు పూర్తి చేయాల్సి ఉంది. ఇక మిగిలి న 165 గ్రామపంచాయతీలను రెండో దశ కింద తీసుకొని ఈ స్పెషల్డ్రైవ్ను కలెక్టర్ అమలు చే స్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, నీటిపారుదల శాఖ, గిరిజన సం క్షేమ శాఖ, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లోని ఇంజినీరింగ్ శాఖ సిబ్బంది సహకారంతో ఎంపీడీవోలు, ఈఓపీఆర్డీలు, ఏపీఎంలు, ఏపీవోలు ఈ కార్యం లో పాల్గొంటున్నారు. చెరో రెండు గ్రామాలను టాస్క్‌గా కేటాయించారు. ఈ గ్రామాలను లక్కీ డీప్ ద్వారా వారికి కేటాయించారు. రెండు గ్రామాల్లో ఒకటి ఫిబ్రవరి, మరొకటి మార్చిలో తీసుకొని ఆ గ్రామాలను ఓడీఎఫ్‌గా మార్చేందుకు కృషి చేయాలి. తద్వారా 165 గ్రామపంచాయతీలను 80 మందికి పైగా అధికారులకు బాధ్యతలు అప్పగించి ఈ కార్యాన్ని సఫలీకృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటింటికి మరుగుదొడ్డి.. గ్రామీణ ప్రాంతాల్లో నీటి కలుషితం కారణంగా అనేక రోగాలు ప్రబలి పర్యావసనంగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రధానంగా పారిశుధ్య లోపం కారణంగానే ఈ పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన నీటిని కలుషితం చేస్తోంది. గ్రామాల్లో ఇప్పటికీ ఇది ప్రధాన సమస్యగా ఉందంటే నమ్మాల్సిందే. పారిశుధ్యం మెరుగుపర్చాలంటే ప్రధానంగా వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరుగుదొడ్డి నిర్మించుకొని వినియోగించడం ముఖ్యమని ప్రజల్లో భావన తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత ప్రవర్తన కారణాలతో పలువురు మరుగుదొడ్డి నిర్మాణాలకు ముందుకు రాకపోవడం సవాలుగా మారుతుంది. ఈ నేపథ్యంలో గౌరవం, గోప్యత, సురక్షిత, సాంఘికస్థితి తెలియజేసేందుకు ఇంటింటికి మరుగుదొడ్డి ఉండాలనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2014 అక్టోబర్ 2న కేంద్ర ప్రభుత్వం క్లీన్ ఇండియా నినాదంతో 2019 అక్టోబర్ 2కు స్వచ్ఛభారత్ నిర్మించాలనే ఉద్దేశ్యంతో వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టి సారించింది. దీని ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ)అనే కార్యక్రమాన్ని చేపట్టి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టింది. 2018 అక్టోబర్ 2 నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయా లని లక్ష్యం పెట్టుకుంది. గత ప్రభుత్వాల హయాంలో మరుగుదొడ్ల నిర్మాణం జరిగినప్పటికీ ఉమ్మడి జిల్లాలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా పెద్దఎత్తున మరుగు దొడ్డి సామగ్రి కొనుగోలు చేసినప్పటికీ నిర్మా ణాలు జరగకపోవడం, సామగ్రి కూడా వృథా అయినటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. బేస్‌లైన్ సర్వే 2012 ప్రకారం స్వచ్ఛభారత్‌లో భాగంగా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు లేని ఇళ్ల సముదాయాలను గుర్తించడం జరిగింది. జనవరి 31లోగా పరిపాలన ఆమోదం తీసుకోవాలి.. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగిరం చేసేందుకు కలెక్టర్ వినూత్న ఆలోచన చేశారు. లక్కీడీప్ ద్వారా అధికారులకు గ్రామాలను కేటాయించడం జరిగింది. మిగిలిన 165 గ్రామపంచాయతీల్లో జనవరి 31లోగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి పరిపాలన ఆమోదం తీసుకోవాలి. మార్చిలో అనుకున్న మేరకు టాస్క్ పూర్తి చేస్తాం. ఒకవేళ కొంత మిగిలిపోయినా గడువుకంటే ముందే పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు అక్టోబర్ 2కు ముందే జిల్లాను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దుతాం. – రాజేశ్వర్ రాథోడ్, డీఆర్డీవో, ఆదిలాబాద్ జిల్లా -
యడ్డిపై కేసు మా పని కాదు
► మంత్రి డీకేపై ఐటీ దాడులెవరు చేశారు? ► సీఎం సిద్ధరామయ్య బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పపై భూముల డీనోటిఫికేషన్ కేసు వ్యవహారం అధికార– విపక్షాల మధ్య అగ్గి రాజేస్తోంది. ఆ కేసు వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ హస్తం ఉందని బీజేపీ ఆరోపిస్తోంటే, తమకు ఏం తెలియదని అధికార పార్టీ అంటోంది. కేసుకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు ధర్నాలకు దిగాయి. సాక్షి, బెంగళూరు: భూముల డీనోటిఫికేషన్ కేసులో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్పపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వెనుక తమ ప్రభుత్వం ఒత్తిడి ఉందని బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని సీఎం సిద్ధరామయ్య అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవరాజ అరసు 102వ జయంతి సందర్భంగా ఆదివారం విధానసౌధ ఆవరణలోనున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇళ్లు లేని పేద ప్రజల కోసం 2008లో బెంగళూరులోని యశ్వంతపుర, యలహంక హోబళిల పరిధిల్లో 3,546 ఎకరాలను సేకరించడానికి అప్పట్లో నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలతో భూముల నోటిఫికేషన్ ప్రక్రియను ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసింది. అయితే అప్పటి సీఎం యడ్యూరప్ప కొంత మంది ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాల కోసం ప్రజల ఇళ్ల కోసం సేకరించిన స్థలాల్లో 257 ఎకరాలను డీనోటిఫై చేయడంతో ఖజానాకు వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. దీంతో జనసామాన్యర వేదిక అధ్యక్షుడు అయ్యప్ప ఈ విషయాలన్నింటిపై ఈ ఏడాది జూన్ నెలలో ఏసీబీ ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ విషయాలేవి తెలియని బీజేపీ నేతలు యడ్యూరప్పపై తమ ప్రభుత్వమే ఏసీబీతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించి ఏసీబీని దుర్వినియోగపరుస్తున్నట్లు నిందలు వేస్తున్నారని విమర్శించారు. ఏసీబీని తాము దుర్వినియోగం చేస్తున్నామని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు రాజకీయ కక్షతో తమ మంత్రి డీ.కే.శివకుమార్‌పై ఐటీ దాడులు చేయించిన కేంద్ర ప్రభుత్వ చర్యకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల కోసం కేటాయించిన స్థలాలను డీనోటిఫై చేసి తప్పు చేసిన యడ్యూరప్పకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు నిరసనలు చేస్తుండడం విచారకరమన్నారు. -
లారీ బోల్తాపడి ఇద్దరు దుర్మరణం
చిత్తూరు జిల్లా కుప్పం-కృష్ణగిరి జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున లారీ బోల్తాపడి ఇద్దరు మృతిచెందారు. ఛత్తీస్‌ఘడ్ నుంచి ఇనుప రేకుల లోడుతో కొచ్చిన్ వెళుతున్న లారీ కుప్పం రూరల్ మండలం నడుమూరు వద్ద మలుపులో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో తమిళనాడు నామక్కల్ జిల్లాకు చెందిన డ్రైవర్ దేవరాజు(35), క్లీనర్ మాధవన్(45) అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదహైలను పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఆస్పత్రికి తరలించారు. -
నంబర్‌వన్ మోసగాడు చంద్రబాబు
పెనుమూరు : ప్రజలను మోసం చేయడంలో ప్రపంచంలోనే నం బర్ మోసగాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు దేవరాజు మాదిగ ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరిలోనే ఉన్నాయని తెలిపారు. శనివారం స్థానిక గ్రామదేవత ముత్యాలమ్మ ఆలయ ఆవరణలో ‘హలో మాదిగ-చలో నారావారిపల్లె’ కరపత్రాలు, గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మాదిగల చెప్పులు కుట్టి, డప్పులు కొట్టి, మాదిగల జెండాతో పాదయాత్ర చేశారన్నారు. అధికారంలోకి వ చ్చాక మాదిగలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని తెలిపారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు నాయుడును మించిన మోసపూరిత నాయకుడు ప్రపంచంలోనే మరొకరు ఉండరని విమర్శించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మం దకృష్ణ మాదిగను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక కులాల మధ్య చిచ్చు పెడుతున్న బోండా ఉమ, గాలి ముద్దుకృష్ణమనాయుడు నోరు అదుపులో పెట్టకోకుంటే చరిత్ర హీనులు కావడం ఖాయమన్నారు. ఈ నెల 10వ తేదీన మాదిగల విశ్వరూప రథయాత్రలో భాగంగా సీఎం నారా చంద్రబాబునాయుడు మోసాలను ప్రజ లకు వివరించేందుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ‘హలో మాదిగ.... చలో నారావారిపల్లె’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తం గా ఉన్న మాదిగలు తరలిరానున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు జి.నారాయణమాదిగ, జిల్లా అధికార ప్రతినిధి పి.రవి, నాయకులు పి.సిద్దయ్య, చిన్నికృష్ణ, హరి, భాస్కర్, మూర్తి, అంజి, సతీష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
మరో ఆరుగురు రైతుల ఆత్మహత్య
బెంగళూరు(బనశంకరి) : రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో మండ్య, చిక్కబళ్లాపుర, యాదిగిరి, తుమకూరు జిల్లాల్లో ఆదివారం ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మండ్య : మండ్య జిల్లా పాండవపుర తాలూకా చిక్కబ్యాడరహళ్లికి చెందిన రైతు దేవరాజు(23) తనకున్న రెండెకరాల పొలంలో చెరుకు పంట సాగుచేసేందుకు రూ.4 లక్షలు దాకా అప్పులు చేశాడు. పంట సక్రమంగా చేతికి అందకపోవడంతో అప్పులకు వడ్డీ సైతం చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అప్పులు తీర్చాలంటూ ఒత్తిళ్లు మొదలయ్యాయి. దీంతో ఆదివారం తన ఇంటిలో దేవరాజు ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనపై పాండవపుర పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే జిల్లా మళవళ్లి తాలూకా అలగూరు హొబళి కల్లకట్టి గ్రామానికి చెందిన రైతు ఉమేష్(36) పంట పెట్టుబడుల నిమిత్తం చేసిన రూ. 3 లక్షల అప్పు తీర్చే మార్గం కానరాక ఆదివారం తన ఇంటిలో ఉరి వేసుకున్నాడు. ఘటనపై హలగూరు పోలీసులు కేసు నమోదు చేశారు. యాదగిరి : యాదగిరి తాలూకా గుంజనూరు గ్రామానికి చెందిన మహిళా రైతు తాయమ్మ(40) తమకున్న 20 ఎకరాల భూమిలో చెరుకు, రాగి, సోయాబీన్స్ తదితర పంటలు సాగు చేశారు. వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం రూ.4 లక్షల మేర అప్పులు చేశారు. వర్షాభావం కారణంగా పంటనష్టం కావడంతో అప్పులు తీర్చే దారిలేక తీవ్రమనస్థాపం చెంది తాయమ్మ ఇంటిలో విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తీవ్రఅస్వస్ధతకు గురైన తాయమ్మను స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి, కలబురిగి జిల్లాసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఆమె మరణించారు. ఘటనపై గురుమిఠకల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. చిక్కబళ్లాపుర :శిడ్లఘట్ట తాలూకా ఎణ్ణందూరు గ్రామానికి చెందిన రైతు మునిశామప్ప(40), తనకున్న పొలంలో వ్యవసాయం చేయడానికి పెట్టుబడుల నిమిత్తం లక్షాంతర రూపాయలు అప్పులు చేశాడు. పంటనష్టం రావడంతో అప్పులు తీరేదారిలేక ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తోటలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఘటనపై శిడ్లఘట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తుమకూరు : తుమకూరు జిల్లా చిక్కహొన్నహళ్లికి చెందిన రైతు శ్రీనివాస్(40), పంటల పెట్టుబడుల కోసం సహకార బ్యాంకులో రూ.50 వేలతో పాటు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు చేశాడు. వర్షం లేక పంట నష్టం రావడంతో అప్పు తీర్చేదారిలేక ఆదివారం మధ్యాహ్నం ఇంటిలో ఉరివేసుకున్నాడు. ఇదే జిల్లా శిరా తాలూకా బెంచఘట్ట సమీపంలోని లక్కనహళ్లికి చెందిన రైతు నాగరాజు(55) తనకున్న ఐదెకరాల పొలంలో పంట పెట్టుబడుల కోసం రూ. 5 లక్షల మేర అప్పులు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో పంట నష్టపోయాడు. దీంతో ఆదివారం ఉదయం తన పొలంలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు.