నంబర్‌వన్ మోసగాడు చంద్రబాబు | Cheat's number one Chandrababu | Sakshi

నంబర్‌వన్ మోసగాడు చంద్రబాబు

Published Sun, Mar 6 2016 1:55 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

నంబర్‌వన్ మోసగాడు చంద్రబాబు - Sakshi

నంబర్‌వన్ మోసగాడు చంద్రబాబు

పెనుమూరు : ప్రజలను మోసం చేయడంలో ప్రపంచంలోనే నం బర్ మోసగాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు దేవరాజు మాదిగ ధ్వజమెత్తారు.  తెలుగుదేశం పార్టీకి ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరిలోనే ఉన్నాయని తెలిపారు. శనివారం స్థానిక గ్రామదేవత ముత్యాలమ్మ ఆలయ  ఆవరణలో ‘హలో మాదిగ-చలో నారావారిపల్లె’ కరపత్రాలు, గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మాదిగల చెప్పులు కుట్టి, డప్పులు కొట్టి, మాదిగల జెండాతో పాదయాత్ర చేశారన్నారు.  అధికారంలోకి వ చ్చాక మాదిగలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని తెలిపారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు నాయుడును మించిన మోసపూరిత నాయకుడు ప్రపంచంలోనే మరొకరు ఉండరని  విమర్శించారు.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మం దకృష్ణ మాదిగను రాజకీయంగా  ఎదుర్కొనే దమ్ములేక  కులాల మధ్య చిచ్చు పెడుతున్న బోండా ఉమ, గాలి ముద్దుకృష్ణమనాయుడు  నోరు అదుపులో పెట్టకోకుంటే చరిత్ర హీనులు కావడం ఖాయమన్నారు. ఈ నెల 10వ తేదీన మాదిగల విశ్వరూప రథయాత్రలో భాగంగా సీఎం నారా చంద్రబాబునాయుడు మోసాలను ప్రజ లకు వివరించేందుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ‘హలో మాదిగ.... చలో నారావారిపల్లె’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  జిల్లా వ్యాప్తం గా ఉన్న మాదిగలు తరలిరానున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు జి.నారాయణమాదిగ, జిల్లా అధికార ప్రతినిధి పి.రవి, నాయకులు పి.సిద్దయ్య, చిన్నికృష్ణ, హరి, భాస్కర్, మూర్తి, అంజి, సతీష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement