
జాతీయ అవార్డులకు నాంది
ఇరుదు చుట్రు దేశ వ్యాప్తంగా సినీవర్గాల్లో మారుమ్రోగుతున్న చిత్రం పేరు ఇది.
ఇరుదు చుట్రు దేశ వ్యాప్తంగా సినీవర్గాల్లో మారుమ్రోగుతున్న చిత్రం పేరు ఇది. రియలిస్టిక్ అంశాలతో కూడిన కథను సమర్థవంతంగా తెరపై ఆవిష్కరించగలిగితే ఎంత మంచి ఫలి తాన్ని అందిస్తుందనడానికి ఒక ఉదాహరణ ఇరుదుచుట్రు. అదీ క్రీడా నేపథ్యం లో వచ్చిన భూలోకం, హిందీ చిత్రం మేరీకోమ్ వంటి చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ అభించిందని ప్ర త్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తరహాలోనే బాక్సింగ్ ఇతి వృత్తంతో మహిళా దర్శకురాలు సుధ కొంగర నాలుగు ఏళ్ల సుధీర్ఘ పరిశోధనతో తయారు చేసుకున్న కథతో తెరకెక్కించిన ఇరుదు చుట్రు చిత్రంలో మాధవన్ కథానాయకుడిగా నటించా రు.
ఆయన చాలా గ్యాప్ తరువాత తమిళంలో నటించిన ఈ చిత్రంలో ముం బయికి చెందిన రియల్ బాక్సింగ్ క్రీడాకారిణి రితిక సింగ్ కథానాయకిగా నటిం చారు. ఆమెకు నటిగా ఇదే తొలి చిత్రం. వైనాట్ స్టూడియోస్, తిరు కుమరన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర హిందీ వెర్షన్‌కు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత రాజ్‌కుమార్ హీర్వాణీ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. కాగా ఇటీవల విడుదలయిన ఇరుదు చుట్రు చిత్ర విజయవంతంగా ప్రదర్శింపబడుతుండడం, విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించడంతో చిత్ర యూనిట్ మంగళవారం థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తమిళ నిర్మాతల మండలి కార్యదర్శి టీ.శివ తన అమ్మా క్రియేషన్స్ సంస్థ పేరుతో ఇరుదు చుట్రు చిత్ర యూనిట్‌కు అవార్డులను ప్రదానం చేయడం విశేషం.
ఈ అవార్డులను నిర్మాతల మండలి, దక్షిణ భారత వాణిజ్యమండలి, దక్షిణ భారత సినీకార్మిక సమాఖ్య నిర్వాహకుల చేతుల మీదగా అందించడం మరో విశేషం. ఈ సందర్భంగా తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను మాట్లాడుతూ ఇరుదు చుట్రు చిత్రానికి అమ్మా క్రియేషన్స్ శివ అందించిన అవార్డులు ముందు ముందు ఈ చిత్రం గెలుచుకోనున్న జాతీయ అవార్డులకు నాంది అని పేర్కొన్నారు. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ ఈ చిత్రం పలు అవార్డులను గెలుచుకుంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఇక చిత్ర కథానాయకుడు మాధవన్ మాట్లాడుతూ చిత్ర నిర్మాణంలో పలు అవరోధాలను ఎదురొడ్డి నిలిచి ఎలాగైనా పూర్తి చేయలన్న దృఢ సంకల్పంతో చేసిన చిత్రం ఇదని అన్నారు. చిత్రం ఇంత మంచి విజయం సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. హిందీలో ఇరుదు చుట్రు ఫైర్ అందుకోవడానికి రెండు రోజులు పడితే తమిళంలో రెండు షోలకే వేడి పుట్టిందని దర్శకురాలు సుధ పేర్కొన్నారు.