తను వెడ్స్ మను 'రిటర్న్స్' రూ. 145 కోట్లు | tanu weds manu returns bags rs 145 crores | Sakshi
Sakshi News home page

తను వెడ్స్ మను 'రిటర్న్స్' రూ. 145 కోట్లు

Jun 23 2015 4:44 PM | Updated on Sep 3 2017 4:15 AM

తను వెడ్స్ మను 'రిటర్న్స్' రూ. 145 కోట్లు

తను వెడ్స్ మను 'రిటర్న్స్' రూ. 145 కోట్లు

నాలుగు వారాల క్రితం విడుదలై బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్టయిన బాలీవుడ్ సినిమా 'తను వెడ్స్ మను రిటర్న్స్' సోమవారం నాటికి దేశీయంగా 145 కోట్ల రూపాయలు వసూలు చేసి అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాలలో 12వ స్థానాన్ని సాధించింది.

నాలుగు వారాల క్రితం విడుదలై బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్టయిన బాలీవుడ్ సినిమా 'తను వెడ్స్ మను రిటర్న్స్' సోమవారం నాటికి దేశీయంగా 145 కోట్ల రూపాయలు వసూలు చేసి అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాలలో 12వ స్థానాన్ని సాధించింది. 2011లో వచ్చిన 'తను వెడ్స్ మను' చిత్రానికి సీక్వెల్‌గా కేవలం 31 కోట్ల రూపాయల ఖర్చుతో తీసిన ఈ సినిమాకు ఇంతటి ఆదరణ లభించడం పట్ల చిత్ర నిర్మాతలే ఆశ్యర్యపడుతున్నారు. కంగనా రనౌత్, మాధవన్ నటించిన ఈ చిత్రం..  'దబాంగ్ 2' వసూలు చేసిన 158 కోట్ల రూపాయల మార్కును త్వరలోనే అధిగమిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.

ఇంతవరకు కలెక్షన్లలో ఆల్‌టైమ్ రికార్డుగా పీకే 339.5 కోట్ల రూపాయలు వసూలు చేయగా, ధూమ్ 3- 280.25 కోట్లు, క్రిష్ 3- 240.5 కోట్లు, కిక్-233 కోట్లు, చెన్నై ఎక్స్‌ప్రెస్-226.7 కోట్లు, హ్యాపీ న్యూ ఇయర్-203.3 కోట్లు, త్రీ ఇడియట్స్-202, ఏక్‌ థా టైగర్-198 కోట్లు, హే జవానీ హై దివానీ-190.5 కోట్లు, బ్యాంగ్ బ్యాంగ్ 181.5 కోట్లు, దబాంగ్ 2-158 కోట్ల కలెక్షన్లు సాధించాయి. తను వెడ్స్ మను రిటర్న్స్ 145 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement