రూ.150 కోట్లు మార్క్ చేరిన తొలి చిత్రం! | 'Tanu Weds Manu Returns' crosses Rs.150 crore mark | Sakshi
Sakshi News home page

రూ.150 కోట్లు మార్క్ చేరిన తొలి చిత్రం!

Published Fri, Jul 3 2015 7:01 PM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM

రూ.150 కోట్లు మార్క్ చేరిన తొలి చిత్రం!

రూ.150 కోట్లు మార్క్ చేరిన తొలి చిత్రం!

న్యూఢిల్లీ: సరిగ్గా ఆరు వారాల క్రితం విడుదలై బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్టయిన బాలీవుడ్ సినిమా 'తను వెడ్స్ మను రిటర్న్స్' సరికొత్త రికార్డును సృష్టించింది.  ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసి ముందు వరుసలో దూసుకుపోతోంది. శుక్రవారం నాటికి రూ.150.03  కోట్లను వసూలు చేసిన ఈ చిత్రం..  2015వ సంవత్సరపు బాక్సాఫీసు కలెక్షన్ల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచింది.

 

2011లో వచ్చిన 'తను వెడ్స్ మను' చిత్రానికి సీక్వెల్‌గా 31 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్నినిర్మించారు. ఇందులో కంగనా రనౌత్, మాధవన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం మరిన్ని కలెక్షన్లు వసూలు చేస్తుందని బాక్సాఫీసు రికార్డు తిరగ రాసే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్ట్ తరార్ ఆదర్ష్ తెలిపారు. తను వెడ్స్ మను రిటర్న్స్ ఇదే ఊపును కొనసాగిస్తే అంతకుముందు 'దబాంగ్ 2' వసూలు చేసిన 158 కోట్ల రూపాయల మార్కును త్వరలోనే అధిగమించే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement