కంగనా రూ. 11 కోట్లు తీసుకుందా? | Kanganas claims of being the highest paid actor are false | Sakshi
Sakshi News home page

కంగనా రూ. 11 కోట్లు తీసుకుందా?

Published Thu, May 26 2016 1:16 PM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

కంగనా రూ. 11 కోట్లు తీసుకుందా? - Sakshi

కంగనా రూ. 11 కోట్లు తీసుకుందా?

లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా వంద కోట్ల వసూళ్లు సాధ్యమే అని నిరూపించిన బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. తన సినిమాల సక్సెస్లతోనే కాదు, ఆ సినిమాల్లో తన అద్భుతమైన నటనతోనూ అందరి దృష్టిని ఆకర్షించిన కంగనా, బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఇమేజ్ సొంతం చేసుకుంది. వరుసగా వందకోట్ల కలెక్షన్ల సినిమాలతో అలరించిన ఆమె, బాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ అంటూ ప్రచారం జరిగింది.

గతంలో వచ్చిన వార్తల ప్రకారం కంగనా, ఒక సినిమాకు దాదాపు రూ.11 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందన్న టాక్ వినిపించింది. ముఖ్యంగా తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమా సమయంలో కంగనానే బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న భామ అని ఫిక్స్ అయ్యారు అంతా. అయితే ఇప్పుడు ఒక్కసారిగా సీన్స్ రివర్స్ అయ్యింది.

ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగూన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది కంగనా. ఈ సినిమాకు కేవలం 3 కోట్ల రూపాయలే రెమ్యూనరేషన్ తీసుకుందట. మరి ఒక్కసారిగా కంగనా పారితోషికంలో ఇంత తేడా ఎందుకు వచ్చింది, అన్న చర్చ మొదలైంది. అసలు నిజంగానే కంగనా 11 కోట్ల పారితోషికం అందుకుందా..? లేక కావాలనే అలాంటి రూమర్స్ సృష్టించారా..? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది నిజమో తెలియాలంటే మాత్రం కంగన నోరు విప్పాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement