మారా కోసం మారా  | Madhavan Is Just Burning Up The Internet | Sakshi
Sakshi News home page

మారా కోసం మారా 

Jun 27 2018 12:33 AM | Updated on Jun 27 2018 12:33 AM

Madhavan Is Just Burning Up The Internet  - Sakshi

‘ఇరుది సుట్రు (తెలుగు ‘గురు’), విక్రమ్‌ వేదా’ చిత్రాల్లో రఫ్‌ లుక్‌లో కనిపించిన మాధవన్‌ ఈసారి లవర్‌బాయ్‌లా చేంజ్‌ అయిపోయారు. నూతన దర్శకుడు దిలీప్‌ రూపొందించనున్న రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ ‘మారా’ కోసం మాధవన్‌ ఇలా మారిపోయారు. ఈ సినిమాలో  తనతో పాటు ‘విక్రమ్‌ వేదా’లో యాక్ట్‌ చేసిన  శ్రద్ధా శ్రీనాథ్‌తో కలసి మళ్లీ వర్క్‌ చేయనున్నారు.

ఈ సినిమా లుక్‌ టెస్ట్‌ మంగళవారం జరిగింది. ‘‘రెండు గంటల్లో నా లుక్‌ని మార్చేశారు నా స్టైలిస్ట్‌.  ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు మాధవన్‌. జిబ్రాన్‌ సంగీతం అందించనున్న ఈ చిత్రం షూటింగ్‌ వచ్చే నెలలో స్టార్ట్‌ కానుంది. ఇదిలా ఉంటే.. షారుక్‌ ఖాన్‌ ‘జీరో’, నాగచైతన్య ‘సవ్యసాచి’లో కనిపించనున్నారు మాధవన్‌. ఈ రెండు చిత్రాల్లోనూ కీలక పాత్రలు చేశారాయన. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement