
మాధవన్ నిజంగా అదృష్టవంతుడే. బహుభాషా నటుడు, దర్శకుడు, నిర్మాత. తాజాగా కథకుడిగానూ మారారు. రన్, ఆలైపాయుదే, ఆయుధ మిన్నలే, ఎళుత్తు, యావరుమ్ నలమ్ ఇలా పలు హిట్ చిత్రాల్లో నటించిన ఈయన.. హిందీ, ఇంగ్లీష్ చిత్రాలలోనూ నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. ఇటీవల 'రాకెట్రీ' మూవీతో దర్శకుడిగాను సక్సెస్ అయ్యారు. తమిళ, హిందీ భాషల్లో తీసిన ఈ చిత్రానికి కథకుడు, నిర్మాత, హీరో ఇతడే కావడం విశేషం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు)
మాధవన్ ప్రస్తుతం తమిళంలో 'టెస్ట్' చిత్రం చేస్తున్నాడు. మరో మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇంతకు ముందు ధనుష్ హీరోగా 'తిరు' అనే సూపర్‌హిట్ తీసిన మిత్రన్ జవహర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి హీరో మాధవన్ కథ అందించడం విశేషం. కాగా ఈ చిత్రానికి 'అదృష్టశాలి' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో కన్నడ బ్యూటీ షర్మిళ మంద్రే నైతిక హీరోయిన్. రాధిక శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుగుతోంది.
(ఇదీ చదవండి: హనీమూన్‌కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?)
Comments
Please login to add a commentAdd a comment