నా మొదటి ప్రేమికుడెవరో తెలుసా? | Amala Paul Reveals Her First Love With Madhavan | Sakshi
Sakshi News home page

నా మొదటి ప్రేమికుడెవరో తెలుసా?

Published Sat, Jun 23 2018 7:32 AM | Last Updated on Sat, Jun 23 2018 2:11 PM

Amala Paul Reveals Her First Love With Madhavan - Sakshi

తమిళసినిమా: నిజజీవితంలో ఇప్పుడు యువత ప్రేమలో పడడం అన్నది సర్వసాధారణంగా మారింది. 90 శాతం మందికి తొలిప్రేమ అనుభవాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనతోనే చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఇక సంచలనం అన్న పదానికే సంచలనంగా మారిన నటి అమలాపాల్‌ తరచూ ఏదో ఒక అంశంతో వార్తల్లో కెక్కడం చూస్తూనే ఉన్నాం. నటిగా ఎంత వేగంగా ఎదిగిందో అంతే త్వరగా దర్శకుడు విజయ్‌తో ప్రేమలో మునిగి తేలి పెళ్లి కూడా చేసేసుకుంది. అయితే అంతే వేగంగా ఆయన నుంచి విడిపోయి విడాకులు కూడా తీసుకుని మళ్లీ నటించడానికి వచ్చేసింది. తాజాగా ఈ అమ్మడు మరో సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో కెక్కే ప్రయత్నం చేసింది. దర్శకుడు విజయ్‌తో ప్రేమ కంటే ముందే మరొకరిని ప్రేమించానని ఆయన మలి ప్రేమికుడని చెప్పకనే చెప్పింది.

ఇటీవల ఒక కార్యక్రమంలో అమలాపాల్‌ పేర్కొంటూ తనకు తొలిప్రేమ కథ ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది. తన మొదటి ప్రేమ అనుభవం గురించి మాట్లాడుతూ తానిప్పుడు నచ్చిన చిత్రాలను ఎంచుకుని నటిస్తున్నానని చెప్పింది. వ్యక్తిగత విషయానికి వస్తే ఇప్పుడు చాలా మందికి మొదటి ప్రేమ ఉంటుందని అలా తనకు తొలిప్రేమ కథ ఉందని చెప్పింది.తన మొదటి ప్రేమికుడు ఎవరో కాదని, నటుడు మాధవన్‌ అని చెప్పింది. మాధవన్‌ అంటే తనకు చిన్నతనం నుంచి చాలా ఇష్టం అని పేర్కొంది. తన తొలి ప్రేమికుడు ఆయనేనని చెప్పింది. ఈ విషయాన్ని చెప్పినప్పుడు నటుడు మాధవన్‌ ఆమె పక్కనే ఉన్నారు. అమలాపాల్‌ చెబుతుంటే మాధవన్‌ చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోయారు. అమలాపాల్‌ మాత్రం లేచివెళ్లి ఆయన్ని హగ్‌ చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement