
మూడ్ ఆఫ్!
హాలీడేస్‌ను కాస్త డిఫరెంట్‌గా న్యూజిలాండ్‌లో ఎంజాయ్ చేద్దామనుకున్న హీరో మాధవన్ మూడ్ ఆఫ్ చేసింది ఓ ఎయిర్‌లైన్ సంస్థ.
హాలీడేస్‌ను కాస్త డిఫరెంట్‌గా న్యూజిలాండ్‌లో ఎంజాయ్ చేద్దామనుకున్న హీరో మాధవన్ మూడ్ ఆఫ్ చేసింది ఓ ఎయిర్‌లైన్ సంస్థ. ఫ్యామిలీతో న్యూజిలాండ్ ఫ్లయిట్ ఎక్కిన ఈ తమిళ తమ్మికి... అందులో వెజిటేరియన్ ఫుడ్ దొరకలేదట. కోపం బుస్సుమని పొంగుకొచ్చినా కంట్రోల్ చేసుకున్న మాధవన్‌కు... ఎయిర్‌లైన్స్ మరో షాకిచ్చింది.
న్యూజిలాండ్‌లో ల్యాండ్ అయిన ఆనందాన్ని అంతలోనే ఆవిరి చేసేసిందట! ఇంతకీ విషయమేమంటే... ఇతగాడి లగేజీ మిస్సయిందట. జాలీ డేస్ కావాల్సిన హాలీ డేస్ ట్రిప్ ఒక్క దెబ్బకు విచారంగా మారిపోయింది. ఇక చేసేది లేక... ఎటూ దిగాం కాబట్టి అక్కడ కొంత షాపింగ్ చేశామని, న్యూజిలాండ్ ప్రజలు మాత్రం అద్భుతమని అదోరకమైన బాధతో ట్వీట్ చేశాడీ హీరో!