
సాక్షి, హైదరాబాద్ : ‘భాగమతి’, ‘అరుంధతి’ లాంటి సినిమాలో విలక్షణ నటనతో ఆకట్టుకున్న హీరోయిన్ అనుష్కశెట్టి అభిమానులకు మరోసారి కనువిందు చేయనుంది. అవును.. అనుష్క అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'నిశ్శబ్ధం' (సాక్షి, మ్యూట్ ఆర్టిస్ట్ ట్యాగ్‌లైన్) సినిమా టీజర్‌ను బుధవారం లాంచ్ చేసింది. మోషన్ టీజర్‌తో ఆకట్టుకున్న చిత్ర యూనిట్ తాజాగా టీజర్‌ను ఆద్యంతం ఆసక్తికరంగా, థ్రిల్లింగ్‌గా రూపొందించారు. అంతేకాదు ఈ సినిమా టీజర్‌లో అనుష్క 'సాక్షి' పాత్రలో దివ్యాంగురాలిగా స్వీటీ అద్భుత నటనతో మెప్పించబోతున్నారు. గోపీ సుందర్ బీజీఎం కూడా బాగానే భయపెడుతోంది. హాలీవుడ్ స్టార్ మైకేల్ మ్యూటసన్ ముఖ్యపాత్ర పోషించడం మరో విశేషం.
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో, కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ సారధ్యంలో అనుష్క, మాధవన్ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం నిశ్శబ్దం. ఈ సినిమాలో అంజలి, షాలినీ పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తెలుగు, తమిళం, ఇంగ్లిష్, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment