పదిహేడేళ్ల తరువాత అదే కాంబినేషన్‌లో..! | Madhavan in talks with Gautham Menon | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 18 2018 12:40 PM | Last Updated on Thu, Jan 18 2018 12:40 PM

Madhavan in talks with Gautham Menon - Sakshi

సౌత్‌ స్టార్ హీరో మాధవన్‌, క్రియేటివ్‌ డైరెక్టర్ గౌతమ్‌ మీనన్ కాంబినేషన్‌ లో వచ్చిన సూపర్‌ హిట్ సినిమా ‘చెలి’. తెలుగు, తమిళల భాషల్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా ఈ సినిమా ఆడియో ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరెట్‌ ఆల‍్బమ్‌. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ఈ క్రేజీ కాంబినేషన్‌ తిరిగి రిపీట్ అవ్వటానికి పదిహేడేళ్ల సమయం పట్టింది.

ఇన్నేళ్ల తరువాత మరోసారి గౌతమ్‌ మీనన్ దర్శకత్వంలో మాధవన్‌ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఇప్పటికే మాధవన్‌ కు కథ వినిపించిన గౌతమ్‌, ప్రస్తుతం స్ర్కిప్ట్‌ డెవలప్‌ చేసే పనిలో ఉన్నాడు. భారీ బడ్జెట్‌ తో రూపొందనున్న ఈసినిమాను తమిళ్‌ తో పాటు హిందీ, ఇంగ్లీష్‌లలోనూ తెరకెక్కించనున్నారట. ఈ ఏడాది ద్వితియార్థంలో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement