కోలీవుడ్‌కు మళ్లీ క్వీన్ | Kangna ranaut in Kollywood | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌కు మళ్లీ క్వీన్

Published Fri, Mar 25 2016 3:39 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

కోలీవుడ్‌కు మళ్లీ క్వీన్

కోలీవుడ్‌కు మళ్లీ క్వీన్

 హిందీ చిత్రం క్వీన్ హీరోయిన్ కంగనా రనౌత్‌ను కోలీవుడ్ చిత్రంలో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం.ఈ బ్యూటీకి కోలీవుడ్ కొత్తేమీ కాదు. చాలా కాలం క్రితం ధామ్ ధూమ్ చిత్రంలో జయంరవితో రొమాన్స్ చేసింది.అయితే అప్పటి ఆమె స్థాయి వేరు ఇప్పటి క్రేజ్ వేరు. ప్రస్తుతం కంగనా రనౌత్ బాలీవుడ్‌లో ప్రముఖ నాయకిగా వెలుగొందుతోంది. అమ్మాయిలంతా మడ్డీ అంటూ అభిమానం కురిపించే నటుడు మాధవన్ నటించిన తనూ వెడ్స్ మను చిత్రం హిందీలో మంచి విజయం సాధించింది.
 
  దీంతో దానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం సక్సెస్ అయ్యింది. ఈ రెండు చిత్రాల్లోనూ మాధవన్‌కు జంటగా కంగనా రనౌత్ నటించింది. ఇప్పుడు తనూ వెడ్స్ మను చిత్రానికి పార్టు-3కి కూడా తెరకెక్కడానికి రెడీ అవుతోంది. పార్టు-1,2 చిత్రాలను రూపొందించిన ఆనంద్ ఎల్.రాయ్‌నే పార్టుకు దర్శకత్వం వహించనున్నారు. తనూ వెడ్స్ మను చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతే కాదు దాని వరిజినల్‌లో నటించిన కంగనా రౌనౌత్‌నే తమిళంలో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం.
 
  అయితే ఈ సంచలన నటి రెండో సారి కోలీవుడ్‌కు రావడానికి సిద్ధం అవుతుందా? అన్నదే చర్చనీయాంశమైన విషయం.ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement